నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌తో టైప్ 2 డ‌యాబెటిస్‌కు చెక్‌..!


Tue,February 19, 2019 03:40 PM

టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు.. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డ‌యాబెటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

క్యారెట్ల‌లో ఉండే బీటా కెరోటిన్‌ను మ‌న శ‌రీరం విట‌మిన్ ఎ కింద మార్చుకుంటుంది. ఈ విట‌మిన్ ఎ ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ద్వారా ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు స‌మ‌తుల్య‌మ‌వుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువ‌ల్ల నిత్యం క్యారెట్ జ్యూస్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే క్యారెట్ల‌లో పిండి పదార్థాలు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ అవి షుగ‌ర్ ను పెంచ‌వ‌ని, అందువ‌ల్ల ఇబ్బంది ఏమీ ఉండ‌ద‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచ‌వ‌చ్చు.

5200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles