రోజూ కాఫీ తాగితే క్యాన్స‌ర్ రాద‌ట‌.. సైంటిస్టుల పరిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన నిజం..!

Tue,March 19, 2019 05:01 PM

కాఫీ ప్రియుల‌కు శుభవార్త‌. నిత్యం కాఫీ తాగడం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. జ‌పాన్‌లోని క‌నజావా యూనివ‌ర్సిటీకి చెందిన ప‌లువురు సైంటిస్టులు ఈ మ‌ధ్యే 16 ఎలుక‌ల‌పై ప్ర‌యోగాలు చేశారు. వాటికి కాఫీ పౌడ‌ర్‌ను ఇచ్చారు. అనంత‌రం వాటిపై ప‌రీక్ష‌లు జ‌రిపారు. దీంతో సైంటిస్టుల‌కు తెలిసిందేమిటంటే.. కాఫీలో ఉండే క‌హ‌వోల్ యాక్సిటేట్‌, కేఫ్‌స్టాల్ అనే స‌మ్మేళ‌నాలు ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయ‌ని, క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల నిత్యం కాఫీ తాగ‌డం వల్ల క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. అయితే కాఫీ తాగితే క్యాన్స‌ర్ రాదు క‌దా.. అని చెప్పి అదే ప‌నిగా ఎక్కువ సార్లు కాఫీ తాగ‌డం కూడా మంచిది కాద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. నిత్యం 2, 3 క‌ప్పుల కాఫీ అయితే ఫ‌ర్వాలేదు కానీ.. అంత‌కు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు..!


3278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles