రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చ‌ట‌..!


Wed,May 8, 2019 12:57 PM

సాధార‌ణంగా బీట్‌రూట్ అంటే మ‌న‌లో ఎవ‌రూ అంత ఇష్టంగా తిన‌రు. ఎందుకంటే.. బీట్‌రూట్ పింక్ రంగులో ఉంటుంది. అది చాలా మందికి అంత‌గా న‌చ్చ‌దు. అందుకే చాలా మంది బీట్‌రూట్‌ను తిన‌రు. కానీ బీట్‌రూట్ వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వల్ల అధిక బ‌రువు త‌గ్గుతార‌ట‌. అవును, ఇది మేం చెప్పడం లేదు, సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి.

బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు తగ్గుతార‌ని ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. నిత్యం బీట్‌రూట్ జ్యాస్ తాగితే శ‌రీరంలో అద‌నంగా ఉండే కొవ్వు క‌రుగుతుంద‌ని వారు అంటున్నారు. అలాగే హైబీపీ త‌గ్గుతుంద‌ని, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల అధిక బ‌రువు ఉన్న‌వారు నిత్యం బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.

3215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles