నీళ్లు తాగండి బరువు తగ్గండి..

Sat,October 31, 2015 11:13 AM

బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదని చెబుతుంటారు కొందరు. వ్యాయామం చేసి, చెమటోడ్చి క్యాలరీలను తగ్గించుకోవడం కంటే సింపుల్‌గా వాటర్ డైట్‌ను ఫాలో అయితే చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
శరీరంలో అదనపు బరువును తగ్గించుకోవడానికి వాటర్ డైట్ బాగా పనిచేస్తుంది. రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగేవారిలో శరీరం మెటబాలిజం రేటును పెంచుకోవవాడానికి సహయపడుతుంది. వ్యాయామం చేసి, చెమటోడ్చి క్యాలరీలను తగ్గించుకోవడం కంటే ఇలా సింపుల్‌గా వాటర్‌డైట్‌ను ఫాలో అయిపోతే కొన్ని పౌండ్ల క్యాలరీలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.


నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గించుకోవడంతోపాటు మరికొన్ని ప్రత్యేకమైన డైట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటర్ రెసిపిలుగా పిలిచే నిమ్మ, తేనె, ఇతర పదార్థాలు జోడించి రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గడంలో తేడాను మీరే గమనించవచ్చు. బరువు తగ్గడానికి మీ వద్ద మరో రెమెడీ ఉన్నట్లయితే, వాటితో పాటు, వాటర్ ట్రిక్స్‌ను కూడా అనుసరించండి. మీ డైలీ డైట్‌లో శరీరానికి సరిపడా నీరు రెగ్యులర్‌గా తాగడం వల్ల శరీరంలో చేరే వ్యర్థాలను శరీరం నుంచి బయటకు నెట్టివెస్తుంది. ఈ వాటర్ డైట్ మిమ్ముల్ని హెల్దీగా, ఫిట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది.

ఇలా చేయండి..


వాటర్ డైట్‌తో బరువు తగ్గించుకోవాలంటే రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల భోజనం సమయంలో మీరు తక్కువగా తినడానికి సాయపడుతుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారు. పొట్ట నిండా నీళ్లు ఉండేలా చూసుకోండి. ఇలా నీళ్లు తాగాడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
ఆకలిని ఆరికడుతుంది

ఆకలిగా ఉన్నప్పుడు హైక్యాలరీ ఫుడ్ తీసుకోవాడం కంటే, నీరు తాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవచ్చు. ఆకలి తగ్గుతుంది. వాటర్ డైట్‌తో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్. బెవరెజ్‌కు బదులుగా నీళ్లు తాగాలి. కాఫీ తాగడం వల్ల కొద్ది సమయం తర్వాత ఎనర్జీ క్రమంగా తగ్గుతుంది. మిమ్ముల్ని మరింత నిదానం చేస్తుంది. కాబట్టి వాటర్ అన్ని విధాలా ఉత్తమం.

వాటర్ డిటాక్స్


త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకొనే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వివిధ రకాల వాటర్ రెసెపిలను ప్రయత్నించాలి.
సలాడ్ విత్ వాటర్ డైట్ : ఒక బౌల్ నిండాహెల్తీ గ్రీన్ ఫుడ్స్‌తో పాటు తీసుకునే బెవరేజ్‌కు బదులుగా నీరు తీసుకుంటే త్వరగా జీర్ణమై, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ :

వాటర్ డైట్‌లో మరో బెస్ట్ ఆప్షన్ గ్రీన్ టీ. ఇది వ్యాధినిరోధకత పెంచుతుంది. మెటబాలిజం శాతం పెరుగుతుంది.

నీళ్లు, వ్యాయామం :

వ్యాయామం చేసే ముందు, తర్వాత నీళ్లు తాగాలి. ముందు నీళ్లు తాగడం వల్ల ఎనర్జీ వస్తుంది. తర్వాత తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ దొరుకుతుంది.

గోరువెచ్చని నీరు :

బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు చాలా సహాయపడుతుంది. ఉదయం చేసే మొదటి పని, వేడినీళ్లను పరగడుపున తీసుకోవాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకుంటే చాలా మంచిది.

ఉదయాన్నే నీరు తాగాలి :

ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే, త్వరగా బరువు తగ్గుతారు. ఈ వాటర్ డైట్ ను అనుసరించి క్యాలరీలను త్వరగా కరిగించుకోండి.

రోజంతా నీరు :

రోజంతా నీరు శరీరానికి సరిపడా తీసుకోవాలి. ఎంత ఎక్కువగా నీరు తీసుకొంటే అంతే ఎక్కువగా శరీరం తేమగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా బరువు తగ్గించుకోవడానికి సహయపడుతాయి.

5476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles