గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Sep 05, 2020 , 22:13:49

బరువు తగ్గాలంటే ఈ పాలే తాగండి!

బరువు తగ్గాలంటే ఈ పాలే తాగండి!

హైదరాబాద్‌: అందరూ ప్రతిరోజూ పాలు తాగుతుంటారు. అయితే అధిక బరువు ఉన్నవారు, బరువు తగ్గాలనుకున్నవారు ఆవుపాటు తాగితే ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే ఇందులో ఫ్యాట్‌ (కొవ్వుశాతం) తక్కువగా ఉంటుంది. కనుక తేలికగా జీర్ణమవుతాయి. ఆవుపాలలో నీరు ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్నారులకు ఆవుపాలనే తాగించాలని నిపుణులు సూచిస్తారు. బర్రెపాలతో పోల్చుకుంటే ఆవుపాలు తీసుకునేవారి ఒంట్లో కొలెస్ట్రాల్‌ చేరదని పేర్కొంటున్నారు. ఆవుపాల మరిన్ని ప్రయోజనాలు..

  • తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. 
  • ఈ పాలు తాగితే కంటి దృష్టి సమస్యలు వుండవు. 
  • ఈ పాలను రోజూ తాగితే బుద్ధి బలం పెరుగుతుంది. 
  • ఆవు పాలు, పెరుగు, నెయ్యి అనేక వ్యాధులను నయం చేస్తాయి.
  • సులభంగా జీర్ణమవుతుంది. కనుక జీర్ణ సమస్యలుండవు.
  • ఈ పాలు పిల్లలకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo