బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Mar 08, 2020 , 15:11:41

దగ్గు వెంటనే తగ్గాలా..? ఈ జ్యూస్‌ తాగండి..!

దగ్గు వెంటనే తగ్గాలా..? ఈ జ్యూస్‌ తాగండి..!

మనకు దాదాపుగా అన్ని రకాల సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో పైనాపిల్‌ కూడా ఒకటి. ఇది తీపి, పులుపు రుచులు కలిపి ఉంటుంది. పైనాపిల్‌లో మన శరీరానికి కావల్సిన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే దీన్ని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే పైనాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల దగ్గును సులభంగా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

పైనాపిల్‌లో ఉండే బ్రొమెలెయిన్‌ అనబడే సమ్మేళనం దగ్గును తగ్గిస్తుంది. ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పైనాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. నిత్యం పైనాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. 


logo
>>>>>>