మంగళవారం 26 మే 2020
Health - May 23, 2020 , 13:41:54

చర్మవ్యాధులకు సొంతవైద్యం వద్దు

చర్మవ్యాధులకు సొంతవైద్యం వద్దు

బన్సీలాల్‌పేట్‌ : ముఖం, చర్మంపై పూత కోసం సొంత వైద్యం పనికి రాదని, చర్మ వైద్యులు సూచించిన నాణ్యమైన మందులనే వాడాలని ఐఏడివిఎల్‌ జాతీయ ఆధ్యక్షుడు డాక్టర్‌ పి.నర్సింహారావు ప్రజలకు సూచించారు. ప్రకటనలను చూసి, నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్ళి హానికారకమైన రసాయనాలతో తయారైన మందులను వాడడం వలన తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు. అలాగే, రోగులకు గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధుల నివారణకై స్టెరాయిడ్స్‌లను వినియోగించడం ప్రమాదకరమని జనరల్‌ ప్రాక్టిషనర్‌లు గుర్తించాలని ఆయన కోరారు. ఐఏడివిఎల్‌ తెలంగాణ శాఖ, ఉస్మానియా వైద్య కళాశాల డివిఎల్‌ విభాగంల సంయుక్త ఆద్వర్యంలో సికిందరాబాద్‌లోని ఓ హోటల్‌లో రెండు రోజులపాటు ఆరు రాష్ర్టాల నుండి హాజరైన ప్రతి నిధులతో నిర్వహించిన మూడవ పీజీకాన్‌ 2019 సౌత్‌ జోన్‌ సదస్సు ఆదివారం ముగిసింది.


logo