బుధవారం 05 ఆగస్టు 2020
Health - Jul 31, 2020 , 20:33:08

ముందు జాగ్ర‌త్త‌గా ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అయితే వీటి ముప్పు త‌ప్ప‌దు!

ముందు జాగ్ర‌త్త‌గా ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అయితే వీటి ముప్పు త‌ప్ప‌దు!

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య గుండెపోటు. ఎప్పుడు వ‌స్తుందో గాని స‌డ‌న్‌గా వ‌చ్చేస్తుంది. దీంతో మ‌నిషి కూర్చున్న చోటే స‌తికిల‌ప‌డుతున్నాడు. ఎమైంద‌ని చూసేస‌రిచే శ‌రీర‌మంతా చ‌ల్ల‌గా మారి చ‌నిపోతున్నాడు. కార‌ణం హార్ట్ ఎటాక్‌. దీని బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ముందు జాగ్ర‌త్త‌గా కొంత‌మంది ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఇలా చేస్తే ముందు జాగ్ర‌త్త దేవుడెర‌గ మ‌రికొన్ని స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం ఖాయమ‌ని బ్రిట‌న్‌, ఇట‌లీ ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

గుండె జ‌బ్బు లేకుండానే ఆస్ప్రిన్‌ టాబ్లెట్ వేసుకుంటే గుండెపోటు బారి నుంచి 17 శాతం త‌ప్పించుకుంటే పేగుల్లో ర‌క్త‌స్రావం బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క్త‌స్రావం ముప్పు 47 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఇక‌పోతే 34 శాతం మెద‌డులో ర‌క్తస్రావం అవుతుంద‌ని అధ్య‌య‌నంలో తేలింది. అందుకే ఏ టాబ్లెట్ అయినా వైద్యుల‌ని స‌ల‌హా మేర‌కే వేసుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

 


logo