గురువారం 03 డిసెంబర్ 2020
Health - Nov 21, 2020 , 15:11:52

మీ భార్య/భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నారా.. లేక భరిస్తున్నారా?

మీ భార్య/భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నారా.. లేక భరిస్తున్నారా?

భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు ప్రేమ ఉన్న చోటే గిల్లికజ్జాలు ఉంటాయి అని కూడా చాలా మంది అంటుంటారు. అలా అని గొడవలు పెట్టకుంటూనే పోతే మాత్రం దాంపత్య జీవితమే చిందరవందరగా తయారవుతుంది. అయితే మనం ఇక్కడ రెండు రకాల మనుషుల్ని గమనించవచ్చు. మొదటి రకం వారు  కోపం వచ్చినప్పుడు మొహం మీదే అన్నీ అనేసి తర్వాత సారీ చెప్పేస్తారు. అన్నీ మర్చిపోయి మళ్లీ భాగస్వామితో యథావిథిగా ప్రేమగా, సంతోషంగా బతుకుతుంటారు.

ఇక రెండో రకానికి వస్తే.. వీళ్లు ఏదీ అంత ఈజీగా బయటకు చెప్పరు. గొడవ జరిగిన తర్వాత సారీ చెప్పరు సరికదా.. మనం చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు.  అంతేకాదు.. ఓ పట్టాన మళ్లీ మామూలు అవరు. ఇలా తరచూ జరిగే చిన్న చిన్న వాదనలు కూడా మనసులో పెట్టుకుని భాగస్వామిని ద్వేషించడం ప్రారంభిస్తారు. ఇక్కడ మొదటి రకం వారితో ఎలాంటి సమస్య ఉండదు. రెండో రకం వారితో అసలైన చికాకు. ఇలాంటి వాళ్లు మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా లోలోపలే ద్వేషం పెంచుకుంటారు. కొన్నాళ్లకు .. ఇదంతా వర్కౌట్ కాదని భాగస్వామితో విడిపోయే వారు కొందరైతే... విడిపోలేక వారిని అలాగే భరిస్తూ బతికేవారు మరికొందరు.

రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అన్నట్లు పరస్పరం ప్రేమానురాగాలు ఉంటేనే దాంపత్య జీవితం బాగుంటుంది. మనం సంతోషంగా ఉండాలంటే మన భార్య/భర్త కూడా నవ్వుతూ ఉండాలి. వాళ్లు మనకు దూరంగా ఉన్నా.. మన వళ్ల  బాధగా ఉన్నా మనం కూడా ఏ మాత్రం ఆనందంగా ఉండలేము. కాబట్టి  మీ భార్య/భర్త మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా..  లేక తప్పక భరిస్తున్నారా.. అన్న విషయాన్ని మీరు తెలుసుకోవడం ఎలా అంటే వారిలో ఈ క్రింది లక్షణాలు ఉన్నాయో లేదో గమనించండి.. అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

  1. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీకు అవసరమైనప్పుడు మీ భర్త/భార్య మీకోసం నిలబడటం లేదా?, మీతో ఎక్కువ సమయం గడపటం, మీ ప్రేమను అంగీకరించడం లాంటివి చేయడం లేదా? 
  2. మీరు వారి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పటానికి వారు ఎలాంటి పనులు చేయడం లేదా? , మీతో సరదాగా బయటకు వెళ్లడం, మీకు నచ్చిన చోటుకు లేదా ప్రత్యేకమైన చోటుకు తీసుకెళ్లడం లేదా?
  3. మీ ప్రవర్తనలో ఏదైనా  నచ్చడం లేదని తరచూ చెబుతున్నారా? , మీరు చేసే ప్రతి పనిలో ఏదో ఒక తప్పును వెతికి ప్రతిదానికి మిమల్ని విమర్శిస్తున్నారా? 
  4. మనం ఆ విషయంలో అలా చేద్దాం, ఈ విషయంలో ఇలా చేద్దాం అంటూ ఏమీ ప్లాన్ చేయకుండా.. ఏదైతే అదే అయిందిలే అంటూ మీ మాటల్ని కొట్టిపారేస్తున్నారా?
  5.  ముఖ్యంగా మీరు మీ  భార్య/భర్త కోసం ఏం చేసినా, ఎంత చేసినా మిమ్మల్ని గుర్తించడం లేదని మీకు అనిపిస్తుందా?  తనకి నచ్చేలా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా కాస్త కూడా మెచ్చుకోవడం లేదా? ఇలా అయితే కచ్చితంగా తన మిమ్మల్ని భరిస్తున్నట్లే అర్థం. 
  6. మీ అభిప్రాయాలు వినడానికి ఇష్టపడరు.. ఒకవేళ విన్నా కూడా అది సరైనది అయినప్పటికీ.. వాటిని తీసిపడేస్తారు, అంగీకరించరు. 
  7. నిజానికి ప్రతి మనిషికి ప్రేమ, మర్యాద చాలా ముఖ్యం. ఇవి లేకుండా ఏ ఇద్దరు వ్యక్తు కలిసి ఉండరు. కాబట్టి మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా? లేక తప్పక భరిస్తున్నారా? అన్న విషయాన్ని పైన ఉన్న లక్షణాలను బట్టి తెలుసుకుండి. ఈ విషయం గురించి వారితో మాట్లాడి, సమస్యను పరిష్కరించుకుని  మీ బంధానికి కొత్తగా మొదలుపెట్టండి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.