శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - May 08, 2020 , 22:29:35

అల్లంతో అస్త‌మాకు చెక్ పెట్టొచ్చా..?

అల్లంతో అస్త‌మాకు చెక్ పెట్టొచ్చా..?

హైద‌రాబాద్: అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. దీని జౌషధ గుణాల్లో కొత్తగా మరోటి వచ్చి చేరింది. అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్ప‌డుతాయ‌ని తేలింది. ఆస్తమా బాధితుల్లో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. సాధారణంగా వీరికి గాలి గొట్టాల్లోని మృదుకండర కణజాలాన్ని వదులు చేసే మందులు ఇస్తుంటారు. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అల్లంలోని జింజెరాల్, షాగావోల్ అనే రసాయనాలను శుద్ధిచేసి వాడితే.. ఆస్తమా మందుల మాదిరిగానే పనిచేస్తాయ‌ని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. అంటే అస్త‌మా రోగుల‌కు అల్లం మంచి ఔష‌ధంగా పనిచేస్తుంద‌న్న‌మాట‌. 


logo