ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Mar 30, 2020 , 16:44:04

కరోనా: మలేరియా మాత్రలతో వైద్యుని మృతి

కరోనా: మలేరియా మాత్రలతో వైద్యుని మృతి

హైదరాబాద్: సొంత వైద్యంతో అసోంకు చెందిన ఓ వైద్యుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తాను వైద్యుడే కానీ వేసుకున్నది రుజువైన మందు కాదు. సౌంతవైద్యం వద్దని కేంద్రం ఓ పక్క మొత్తుకుంటుంటే నాకు ఇంకొకరి ప్రిస్క్రిప్షనా అంటూ అతడు కరోనా రాకూడదని మలేరియా మాత్ర వేసుకున్నాడు. ఇటీవల రకరకాల చిట్కాలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో మలేరియా మాత్ర వేసుకుంటే కరోనా సోకదనేది ఒకటి. ఎక్కువగా వైద్యులే ఆత్మరక్షణకు ఈ మాత్రలు వినియోగిస్తున్నారు. అసోంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే 44 సంవత్సరాల ఉత్పల్‌జిత్ బర్మన్ అనే అనెస్థటిస్టు అదే మాత్ర రెండుప డోసులు వేసుకున్నాడు. అనంతరం గుండె సంబంధ సమస్యలు తలెత్తడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బర్మన్ మరణించాడు. ఆయన మృతిపై లోతైన దర్యాప్తు జరుగుతున్నది.


logo