గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 11:22:13

డాక్టర్‌కు కరోనా.. సర్కారీ దవాఖాన మూసివేత

డాక్టర్‌కు కరోనా.. సర్కారీ దవాఖాన మూసివేత

హైదరాబాద్: ఢిల్లీలోని ప్రభుత్వ క్యాన్సర్ దవాఖాన ఓపీ విభాగాన్ని మూసివేశారు. ఆ విభాగాన్ని నిర్వహిస్తున్న వైద్యురాలికి కరోనా సోకడమే 


ఇందుకు కారణం. బ్రిటన్ నుంచి వచ్చిన సమీప బంధువుల ద్వారా ఆమెకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. దవాఖానలోకి 


ఓపీడీతోపాటు ఆఫీసులు, ల్యాబులు మూసేసి రసాయనాలు చల్లి శుద్ధి చేస్తున్నారు. డాక్టరును కలిసినవారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఢిల్లీలో రెండు 


బస్తీ దవాఖానాలు నడిపే డాక్టర్లకు ఇటీవల  కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 120 కరోనా కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు 


మరణించారు. మగళవారం ఒక్కరోజే మర్కజ్ నిజాముద్దీన్ ఘటన కారణంగా కరోనా రోగుల సంఖ్య ఒక్కసారిగా 24 పెరిగింది.


logo