శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 23, 2020 , 15:52:10

వాష్‌రూంలో మొబైల్ వాడుతున్నారా?

వాష్‌రూంలో మొబైల్ వాడుతున్నారా?

ఈ మ‌ధ్య జ‌నాలు ఏం లేక‌పోయినా ఉంటున్నారు కాని చేతిలో ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నారు. చెప్పాలంటే.. ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే చేతిలో ఫోన్ ప‌ట్టుకొని నేరుగా బాత్రూమ్ వెళ్తున్నారు. ఫోన్ ఎందుకంటే. అక్కడ కూడా ఫోన్‌తో టైంపాస్‌ అని, న్యూస్‌ చదవడం అని ఇంకోటని అంటున్నారు. అందుకే వీరికి మాట‌ల‌తో కాకుండా ఏకంగా హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అన‌ర్థాలు జ‌రుగుతాయో మీరే చ‌దివి తెలుసుకోండి. 

1. టాయ్‌లెట్‌ రూంలో స్మార్ట్‌ఫోన్ వాడటం వ‌ల్ల డ‌యేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన ప‌డే అవకాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

2. టాయ్‌లెట్‌లో ఉండే సింకులు, న‌ల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు క‌లిగించే బాక్టీరియా ఉంటుంద‌ని, టాయ్‌లెట్‌కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్ల‌ను ముట్టుకున్న చేతుల‌తోనే మ‌ళ్లీ మొబైల్ ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల బాక్టీరియా ఫోన్ మీద‌కి చేరుకుంటుంద‌ని, అలా చేరుకోవ‌డం వ‌ల్ల ఎప్పుడూ తోడుగా ఉండే ఫోన్ నుంచి ఏదో ర‌కంగా బాక్టీరియా శ‌రీరంలో ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంద‌ని లండ‌న్ మెట్రోపాలిట‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్ట‌ర్ పాల్ మెటెవాలే తెలిపారు.

3. అలాగే సాధార‌ణంగా చేసే కొన్ని ప‌నుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల కూడా ప్ర‌మాదాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. బ్యాగుల‌ను శుభ్రం చేయ‌క‌పోవ‌డం, బూట్ల‌ను ఇంటి లోప‌ల ధ‌రించ‌డం, విప్ప‌డం, టీవీ రిమోట్, కంప్యూట‌ర్ కీబోర్డు, మౌస్‌ల‌ను శుభ్రం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా రోగాల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల‌ని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. 


logo