శుక్రవారం 23 అక్టోబర్ 2020
Health - Sep 19, 2020 , 19:45:53

నాలుక‌ 'తెలుపు' రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసా? కార‌ణాలివే!

నాలుక‌ 'తెలుపు' రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసా?  కార‌ణాలివే!

కొంత‌మంది నాలుక‌ ఎర్ర‌గా ఉంటే మ‌రికొంద‌రి నాలుక తెల్ల‌గా ఉంటుంది. తెల్ల‌ని నాలుక‌కు కార‌ణం వారు నోటిని శుభ్రం చేసుకోక‌పోవ‌డ‌మే. దీన్ని ఇలానే వ‌దిలేస్తే నాలుక ఎర్ర‌బ‌డ‌డం, వాపు, గ‌డ్డ‌లు వంటి స‌మ‌స్య‌లు మొద‌లవుతాయి. నాలుక మీద ఈ గ‌డ్డ‌లు బ్యాక్టీరియా, ఆహారం, ధూళి, చ‌నిపోయిన క‌ణాల‌ను కూడా ట్రాప్ చేస్తాయి. అస‌లు నాలుక తెల్ల బ‌డ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం.  

* నోరంతా ఎండిపోవ‌డం వ‌ల్ల నాలుక తెల్ల‌గా మారుతుంది.

* శ‌రీరం డీహైడ్రేట్ అయితే నాలుక కూడా డీహైడ్రేట్‌కు గుర‌వుతుంది. దీని కార‌ణంగా కూడా నాలుక తెల్ల‌గా మారుతుంది.

* జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు నోరంతా చేదువుగా ఉంటుంది. దీనికి కార‌ణంగా నాలుక తెల్ల‌బ‌డ‌ట‌మే.

* ల్యోకోప్లాకియా :  ధూమ‌పానం వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అరుదైన సంద‌ర్భాల్లో నోటి క్యాన్స‌ర్‌గా అభివృద్ది చెందే అవ‌కాశం ఉంది.

* పొగాకు న‌మ‌ల‌డం, ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల నాలుక ఎక్కువ‌గా తెల్ల‌బ‌డుతుంది.

* అధికంగా మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల కూడా ఇలా మారుతుంది.

* సాఫ్ట్‌ఫుడ్ తిన‌డం వ‌ల్ల కూడా నాలుక రంగు మారుతుంది.

* నాలుక‌ను వ్య‌తిరేకంగా రుద్ద‌డం వ‌ల్ల కూడా క‌ల‌ర్ చేంజ్ అవుతుంది.

* తెల్ల‌నాలుకను గ‌మ‌నించిన‌ట్ల‌యితే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ కింది ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. 8

ల‌క్ష‌ణాలు :

* నాలుక మీద మంట‌

* ఆహారం న‌మ‌ల‌డం, మింగేట‌ప్పుడు, మాట్లాడేట‌ప్పుడు నొప్పి ఉన్న‌ప్పుడు వైద్యుడిని సంప్ర‌దిచాలి. 

* బ‌రువు త‌గ్గ‌డం

* చ‌ర్మం మీద ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌టం.

* స‌డ‌న్‌గా జ్వ‌రం రావ‌డం.

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించాలి.


logo