స్నానం నీళ్లలో దీన్ని క‌లిపి వాడితే ఏమ‌వుతుందో తెలుసా..?


Wed,January 11, 2017 04:15 PM

శారీర‌కంగా ప‌ని చేసి బాగా అల‌సిపోయారా..? కీళ్లు, కండ‌రాల నొప్పులు, న‌రాల బెణుకులు ఉన్నాయా..? అయితే ఎప్సం సాల్ట్‌ను వేడి నీళ్ల‌లో క‌లిపి ఆ నీటితో స్నానం చేయండి. అంతే... ఆయా స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మార్కెట్‌లో మ‌న‌కు దొరికే ఎప్సం సాల్ట్‌ను తీసుకువ‌చ్చి స్నానం చేసే నీళ్ల‌లో దాన్ని రెండు స్పూన్ల మోతాదులో వేసి అనంతరం ఆ నీటితో స్నానం చేస్తే చాలు. అప్పుడు ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం అణువులు నీటిలో వెంట‌నే క‌లిసి దాంతో ఆ అణువులు మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ అణువులు మ‌న దేహంపై వెంట‌నే ప్ర‌భావం చూపుతాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు, కండ‌రాల నొప్పులు, బెణుకులు ఇట్టే త‌గ్గిపోతాయి. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దేహం తేలిక‌గా మారుతుంది.

ఎప్సం సాల్ట్‌తో పైన చెప్పిన ఉప‌యోగ‌మే కాదు, దాని వ‌ల్ల మ‌న‌కు ఇంకా ఇత‌ర లాభాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే... ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల ఎప్సం సాల్ట్ క‌లుపుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉండ‌దు. ఎముక‌లు దృఢంగా మారుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది.

9533
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS