స్నానం చేసే నీళ్లలో ఎప్సం సాల్ట్‌ను క‌లిపి వాడితే..?


Wed,January 3, 2018 08:14 PM

శారీర‌కంగా ప‌ని చేసి బాగా అల‌సిపోయారా..? కీళ్లు, కండ‌రాల నొప్పులు, బెణుకులు ఉన్నాయా..? అయితే ఎప్సం సాల్ట్‌ను వేడి నీళ్ల‌లో క‌లిపి ఆ నీటితో స్నానం చేయండి. అంతే... ఆయా స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మార్కెట్‌లో మ‌న‌కు దొరికే ఎప్సం సాల్ట్‌ను తీసుకువ‌చ్చి స్నానం చేసే నీళ్ల‌లో దాన్ని రెండు స్పూన్ల మోతాదులో వేసి అనంతరం ఆ నీటితో స్నానం చేస్తే చాలు. అప్పుడు ఎప్సం సాల్ట్‌లో ఉండే మెగ్నిషియం అణువులు వెంట‌నే నీటిలో క‌లిసి అవి మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. ఈ క్ర‌మంలో ఆ అణువులు మ‌న దేహంపై వెంట‌నే ప్ర‌భావం చూపుతాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు, కండ‌రాల నొప్పులు, బెణుకులు ఇట్టే త‌గ్గిపోతాయి. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దేహం తేలిక‌గా మారుతుంది. ఎప్సం సాల్ట్‌తో పైన చెప్పిన ఉప‌యోగ‌మే కాదు, దాని వ‌ల్ల మ‌న‌కు ఇంకా మ‌రో లాభం కూడా ఉంది. అదేమిటంటే... ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల ఎప్సం సాల్ట్ క‌లుపుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉండ‌దు. ఎముక‌లు దృఢంగా మారుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య పోతుంది.

5181

More News

VIRAL NEWS