సోమవారం 26 అక్టోబర్ 2020
Health - Sep 30, 2020 , 20:13:17

40 ఏండ్లు దాటిన వారు ఎన్ని గంట‌లు ప‌నిచేయాలో తెలుసా?

40 ఏండ్లు దాటిన వారు ఎన్ని గంట‌లు ప‌నిచేయాలో తెలుసా?

వ‌య‌సు మీద ప‌డేకొద్ది ప‌ని స‌మ‌యాన్ని త‌గ్గిస్తూ రావాలి. లేదంటే అనారోగ్యాల‌కు గుర‌వుతార‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. యువ‌కులు చేసిన‌ట్లుగా రోజుకు 8 గంట‌లు ప‌నిచేస్తే అనుకోని ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటున్నారు. 40 ఏండ్లు దాటిన వారు వారానికి 25 గంట‌లు మించి ప‌నిచేస్తే ఒత్తిడి, అల‌స‌టకు గుర‌వుతారు. ఖాళీగా ఉండ‌టం క‌న్నా ఏదొక ప‌ని చేస్తుంటే మెద‌డు చురుగ్గా ఉంటుంది అంటారు.

కానీ, అదే స‌మ‌యంలో ఆందోళ‌న‌, ఒత్తిడికి ఎక్కువ‌గా లోన‌వుతార‌ని అస‌లు ఊహించ‌లేరు. దీని మీద ప‌రిశోధ‌న కూడా జ‌రిపారు. 3 వేల‌మంది పురుషులు, 3,500 మంది మహిళలకు కాగ్నిటివ్ టెస్టు నిర్వహించడం ద్వారా వారి పనితీరును విశ్లేషించారు. కాబ‌ట్టి వ‌య‌సును మ‌న‌సులో పెట్టుకొని ఎన్ని గంట‌లు ప‌నిచేయాలో తెలుసుకోవ‌డానికి ఒక‌సారి వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. 

 


logo