శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 12:05:17

మెంతులు చేసే మేలు తెలుసా..?

మెంతులు చేసే మేలు తెలుసా..?

హైద‌రాబాద్‌: ‌సాధార‌ణంగా మ‌నం వంట‌ల్లో రుచి, సువాస‌న కోసం ఉప‌యోగించే ప్ర‌తి వ‌స్తువులో ఔష‌ధ గుణాలుంటాయి. అల్లం, వెల్లుల్లి, యాల‌కులు, ల‌వంగాలు, క‌రివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తిదీ ఔష‌ధంగా ఉప‌యోగప‌డుతుంది. అదేవిధంగా ప‌చ్చి చేప‌ల కూర‌లో సువాస‌న కోసం, నిలువ ప‌చ్చ‌ళ్ల‌లో చ‌ల్ల‌ద‌నం కోసం ఉప‌యోగించే మెంతుల్లో కూడా ఎన్నో ఔష‌ధ గుణాలున్నాయి. మ‌రి అవేంటో చూద్దామా..?

  • మెంతులు నాన‌బెట్టుకుని తిన‌డంవ‌ల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.  
  • మ‌ల‌బ‌ద్ధ‌కం వ‌చ్చిన‌ప్పుడు మెంతులు తిన‌డం ద్వారా మంచి ఫ‌లితం ఉంటుంది. 
  • జ‌లుబు, ఒంటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు గోరువెచ్చ‌ని నీళ్ల‌లో మెంతులు వేసుకుని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మెంతులు శరీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌గ్గిస్తాయి.
  • బాలింత‌ల్లో పాల ఉత్ప‌త్తిని పెంచ‌డానికి మెంతులు తోడ్ప‌డుతాయి.
  • నిత్యం మెంతులు తీసుకోవ‌డం ద్వారా కీళ్ల‌ నొప్పులు త‌గ్గుతాయి. 
  • కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యానికి మెంతులు తోడ్ప‌డుతాయి.
  • నెల‌స‌రి స‌మ‌యంలో క‌డుపు నొప్పి వ‌చ్చిన‌ప్పుడు గోరువెచ్చ‌ని నీటిలో మెంతులు వేసుకుని తాగితే ఉప‌శ‌మ‌నం ఉంటుంది. 
  • మెంతులు కొలెస్ట‌రాల్‌ను నియంత్రిస్తాయి. కండ‌రాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.            


logo