హైదరాబాద్: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ విస్తరిస్తున్నది. అన్ని దేశాల్లోనూ ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నవారు పెరిగిపోతున్నారు. మన దేశంలోనూ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అయితే చాలా మంది మొదట్లో తమకు డయాబెటిస్ ఉందన్న విషయం గుర్తించలేకపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరి ముప్పు పెరిగిపోతున్నది. అందుకే డయాబెటిస్ వచ్చే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
డయాబెటిస్ రాబోయే ముందు కనిపించే లక్షణాలను ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ దశలో కొందరికి జట్టు రాలుతుంది. మరికొందరికి రోజంతా అలసటగా ఉంటుంది. ఏం పని చేయకపోయినా కూడా అలసటగా అనిపిస్తుంది. ఇంకొందరికి చర్మంపై మచ్చలు వస్తుంటాయి. కొందరిలో తరచూ మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. కొంతమందిలో వీటికి అదనంగా తలనొప్పి, చేతులు కాళ్లు తిమ్మిర్లు పట్టడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్‌కు సంకేతాలుగా ఉంటాయి. పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే షుగర్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం.