శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jun 26, 2020 , 20:39:47

రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారా.?

రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారా.?

ఈ మధ్య చాలా మంది ఫిట్‌గా ఉండాలనే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో అన్నం తినకుండా రోటీ, పుల్కా, వేరే ఏదైనా టిఫిన్స్, పండ్లు తింటున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. మనలో చాలా మందికి చపాతీలు తిన్నా.. మళ్లీ అన్నం తినాలపిస్తుంది. ఇక వాటన్నింటి బదులు అన్నమే తిందాం అనుకుంటారు. వాస్తవానికి ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు అన్నం ఎంత తిన్నాపర్వాలేదు. ఎందుకంటే వారు శారీరక శ్రమ పెరిగి ఎక్కువ క్యాలరీల శక్తి అవసరముంటుంది కాబట్టి. కానీ కూర్చుని పని చేసే వారు అన్నం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వారు ప్రతి రోజు వ్యాయామాలు చేయాలి. లేదా అధిక బరువు పెరిగి గుండె జబ్బులు, షుగర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

అన్నం కూడా సమయానికి తగ్గట్టుగానే తిన్నాలి. పగటి పూట అన్నం తింటే పర్వాలేదు. కానీ రాత్ర పూట తిండిని కట్టడి చేయాల్సిందే. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువుతో పాటు కొవ్వు శాతం కూడా పెరిగి గెండె సమస్యలు వస్తాయి. రాత్రి పూట ఆహారం తక్కువుగా తింటే అంత మంచిది. త్వరగా జీర్ణమవుతుంది.. కడుపు కాస్త ఖాళీగా ఉంటే నిద్ర కూడా బాగా పడుతుంది. సాధ్యమైనంత వరకూ రాత్రి పూట అన్నం మానేసి రోటీ, పుల్కాలు,  పండ్లు తీసుకోవాలి.logo