గురువారం 13 ఆగస్టు 2020
Health - Jul 29, 2020 , 19:21:52

మాస్క్ ధరించినప్పుడు నోటి నుంచి దుర్వాసన రాకుండా ఇలా చేయండి

మాస్క్ ధరించినప్పుడు నోటి నుంచి దుర్వాసన రాకుండా ఇలా చేయండి

ఒక వ్యక్తి నోటి నుంచి దుర్వాసన రావడానిక చాలా కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, నోటి పరిశుభ్రత, దంతాక్షయం, చిగుళ్ల వ్యాధి వంటివి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్లినా మాస్కు తప్పని సరి అయింది.  అలా మాస్కు ధరించిన సమయంలో శ్వాస నుంచి దుర్వాసన వస్తుందా?  అయితే దానిని నివారించడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

  • సోంపు :  యాంటీ-సెప్టిక్ లక్షణాలు చెడు శ్వాసను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ సోంపు నోటిలో వేసుకొని నమలడం వల్ల నోరు రీఫ్రెష్ అవుతుంది.
  • దాల్చిన చెక్క :  ఇందులో ఆల్డిహైడ్ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను తొలగిస్తుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి,
  • బిర్యానీ ఆకు, 1-2 ఏలకులు కొద్దిగా నీటిలో వేసి మరిగించాలి. చల్లబడిన తర్వాత ఆ గ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
  • నిమ్మకాయ :  ఓ నిమ్మకాయ ముక్కను నోటిలో వేసి నమలడం ద్వారా నోరు రీఫ్రెష్ అవుతుంది. నిమ్మ తొక్క నోటిని శుభ్రచేస్తోంది.  నిమ్మకాయలోని సిట్రిక్ ఆమ్లం నోటిలో దుర్వాసనతో పోరాడుతుంది. లేదా ప్రతిరోజూ ఒక కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి.


  • కొత్తిమీర : ఇందులోని క్లోరోఫిల్ చెడు శ్వాసను తగ్గించడంలో అద్భుతమైనది. కొత్తిమీర ఆకులను నోటిలో వేసుకొని నమలాలి. దీంతో దుర్వాసన తగ్గుతుంది.   
  • లవంగం : ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని రిఫ్రెష్ చేస్తాయి. మీ నోటిలో కొన్ని లవంగాలను నమలడం ద్వారా మీరు చెడు శ్వాసను వదిలించుకోవచ్చు. లేదా లవంగం టీని మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ లవంగా పొడి వేసి 5-10 నిమిషాలు మరగబెట్టాలి. తర్వాత దానితో రోజుకు రెండుసార్లు నోటీని శుభ్రం చేసుకోవాలి. 
  • బేకింగ్ సోడా  : ఆల్కహాల్ లేని మౌత్ వాష్ చేయడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి  పుదీనా నూనె చుక్కలను జోడించండి. తర్వాత ఈ మిశ్రమంతో నోరు శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా నోటిలోని దుర్వాసన తొలగిపోతుంది.  
  • నీరు : రోజూ పుష్కలంగా నీరు తాగడం ద్వారా కూడా నోరు రిఫ్రెష్ అవుతుంది. అలాగే, మీ నోటిని చల్లటి నీటితో తరచుగా కడగడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. మీరు వీటిని ప్రతిరోజూ తీసుకుంటే, దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నాశనమై దుర్వాసన పోతుంది.


logo