పొట్ట త్వ‌ర‌గా త‌గ్గించే ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌..!


Wed,February 20, 2019 02:59 PM

అధిక బ‌రువు, పొట్ట‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? ఎంత ప్ర‌య‌త్నించినా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గ‌డం లేదా ? అయితే కింద తెలిపినట్టుగా ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చేసి చూడండి. చాలా త్వ‌రగా పొట్ట క‌రిగిపోతుంది. మ‌రి ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఎలా చేయాలో, ఎన్ని రోజులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్నే ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు.. పొట్ట కూడా తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

పైన చెప్పిన ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ కింద సూచించిన విధంగా చేస్తే కేవ‌లం 28 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది. కింద సూచించిన స‌మ‌యం ప్ర‌కారం ఈ ఎక్స‌ర్‌సైజ్ ను రోజూ చేస్తే ఫ‌లితం ఉంటుంది.

మొద‌టి రోజు – 20 సెకండ్లు
రెండో రోజు – 20 సెకండ్లు
3వ రోజు – 30 సెకండ్లు
4వ రోజు – 30 సెకండ్లు
5వ రోజు – 40 సెకండ్లు
6వ రోజు – రెస్ట్
7వ రోజు – 45 సెకండ్లు
8వ రోజు – 45 సెకండ్లు
9వ రోజు – 60 సెకండ్లు
10వ రోజు – 60 సెకండ్లు
11వ రోజు – సెకండ్లు
12వ రోజు – 90 సెకండ్లు
13వ రోజు – రెస్ట్
14వ రోజు – 90 సెకండ్లు
15వ రోజు – 90 సెకండ్లు
16వ రోజు – 120 సెకండ్లు
17వ రోజు – 120 సెకండ్లు
18వ రోజు – 150 సెకండ్లు
19వ రోజు – రెస్ట్
20వ రోజు – 150 సెకండ్లు
21వ రోజు – 150 సెకండ్లు
22వ రోజు – 180 సెకండ్లు
23వ రోజు – 180 సెకండ్లు
24వ రోజు – 210 సెకండ్లు
25వ రోజు – రెస్ట్
26వ రోజు – 210 సెకండ్లు
27వ రోజు – 240 సెకండ్లు
28వ రోజు – 240 సెకండ్లు ఆపైన మీ ఇష్టం

ఇలా ఆరంభంలో కొంత స‌మ‌యంతో ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్‌ను మొదలు పెట్టి మ‌ధ్య‌లో రెస్ట్ ఇస్తూ.. టైం పెంచుతూ ఈ వ్యాయామం చేస్తే త్వ‌ర‌గా పొట్ట త‌గ్గుతుంది.

21141

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles