వేరుశెనగలు తింటే బరువు పెరుగుతారా..?


Thu,December 21, 2017 12:02 PM

వేరుశెనగలను నిత్యం మనం పలు వంటల్లో వేస్తూనే ఉంటాం. వీటితో చట్నీలు చేసుకుంటారు. కూరల్లో సూప్ చిక్కదనం కోసం పల్లీలను వేస్తారు. ఇక కొందరైతే పల్లీలను అలాగే తింటారు, మరికొందరు వేయించుకుని, ఉప్పు, కారం చల్లి తింటారు. అయితే ఎలా తిన్నా వేరుశెనగలతో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. కానీ వీటిని నిత్యం తగిన మోతాదులోనే తినాల్సి ఉంటుంది. లేదంటే అధికంగా బరువు పెరుగుతారు.

కేవలం ఒక గుప్పెడు వేరుశెనగ పప్పును తింటే మనకు దాదాపుగా 170 క్యాలరీల వరకు అందుతాయి. ఈ పరిమాణంలో వేరుశెనగలను రోజూ ఎవరైనా తినవచ్చు. కానీ ఇంతకు మించి మోతాదు దాటితే శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించి ఉప్పు చల్లిన సాల్టెడ్ పల్లీలను తింటే వాటిల్లో ఉండే అధిక సోడియం కారణంగా అధిక బరువు పెరుగుతామని వైద్యులు అంటున్నారు. కనుక ఎవరైనా రోజూ గుప్పెడు పల్లీలను తింటే చాలని, అంతకు ఎక్కువ మోతాదులో తింటే మాత్రం అధికంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. అయితే నిత్యం శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు, వ్యాయామం చేసే వారు, క్రీడాకారులు 3, 4 గుప్పెళ్ల వరకు వేరుశెనగలను తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

8531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles