సోమవారం 30 మార్చి 2020
Health - Mar 14, 2020 , 10:45:31

ఈ ఐదు ఉండగా.. ఫ్లూ భయమెందుకు?

ఈ ఐదు ఉండగా.. ఫ్లూ భయమెందుకు?

అసలే కరోనా కలవరం జనాల్ని వణికిస్తోంది. ఏ చిన్నపాటి జలుబు చేసినా ఆందోళన చెందుతున్నారు. ఫ్లూ లాంటి సాధారణ జ్వరాలు వచ్చినా కరోనా కావచ్చేమో అని కంగారు పడుతున్నారు. అలా భయపడటం కాదు ముందు ఫ్లూను తరిమేయండి అంటున్నారు నిపుణులు. వీటికోసం 5 హోం రెమిడీస్‌ను సూచిస్తున్నారు. 

1. పసుపు: 

దీంట్లో యాంటీ వైరల్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత తీవ్రమైన జలుబు అయినా పసుపుతో చెక్‌ పెట్టొచ్చు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీ ఫంగల్‌.. యాంటీ మైక్రోబియల్‌.. యాంటీ బాక్టీరియల్‌గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని వాడటం మంచిది. 

2. జీలకర్ర: 

వీటిలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. హీమోగ్లోబిన్‌ పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సీజన్‌ శరీర కణాలన్నింటికీ రవాణా కావడానికి ఇది సహకరిస్తుంది. శక్తి ఉత్పత్తి.. జీవక్రియ.. రోగ నిర్ధారణ శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. 

3. మిరియాలు: 

నల్ల మిరియాలు యాంటీ ఆక్సిడెంట్లు.. యాంటీ బాక్టీరియల్‌ ఏజెంట్స్‌గా ఉపయోగపడి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇది విటమిన్‌-సి కూడా కలిగి ఉంటుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. 

4. లవంగాలు: 

లవంగం సేంద్రియ లక్షణం కలిగి ఉంటుంది. గొంతు.. అన్నవాహికలో కఫాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. 

5. వామ: 

ఇది జలుబు.. నాసికా అవరోధాలను సులభంగా తొలగిస్తుంది. ఫ్లూ జ్వరంతో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. logo