ప‌ర‌గడుపున ఈ ఆహారాల‌ను అస్స‌లు తీసుకోరాదు..!


Sun,December 16, 2018 04:11 PM

ఆహారం మితంగా తీసుకుంటేనే మ‌న‌కు ఔషధంగా అది ప‌నిచేస్తుంది. అదే ఆహారం ఎక్కువైతే మ‌న శ‌రీరంలో అదే విషం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఇత‌ర స‌మ‌యాల్లో తీసుకుంటే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ వాటినే ప‌ర‌గ‌డుపున తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ప‌ర‌గ‌డుపున మ‌నం తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున వాటిని తాగడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ త‌ప్పుతాయని వారు చెబుతున్నారు. కాబట్టి ఒక గ్లాస్‌ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిదని వారు అంటున్నారు.

2.ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

3. చాలా మంది పరగడుపున టమోటా రైస్‌, టమోటా బాత్‌ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తిన్న తరువాత పుల్లటి పదార్థాలు తినడం మంచిది.

4. పరగడుపున పండ్లు తినడం మంచిదని ఇటీవల ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ అది నిజానికి అంత మంచిది కాదు. అందులోనూ అరటి పండ్ల‌ను ప‌ర‌గ‌డుపున‌ అస్సలు తినకూడదు. అందులో ఉండే మెగ్నిషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందడం మంచిదికాదు.

5. పరగడుపున శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణాశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదల‌వుతాయి. ఈ ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వేటినైనా తినేముందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.

9533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles