పరగడుపునే వీటిని అస్సలు తీసుకోకండి..!


Sun,August 5, 2018 12:44 PM

క్షణం తీరికలేని జీవనశైలిలో భాగంగా చాలా మంది ఆరోగ్యం, తీసుకునే ఆహారం పట్ల దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడు ఏం తీసుకుంటున్నారన్నది పట్టించుకోవడం లేదు. కానీ పరగడుపున తీసుకునే ఆహారం, చేసే పనుల మీద మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

1. ఆలస్యంగా నిద్ర లేచినప్పుడు, అలవాటులో భాగంగానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీయాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివి బాధిస్తాయి. వీటన్నింటి కంటే మంచినీళ్లు తాగడం చాలా మంచిది.

2. ఘాటైన మసాలాలు, గ్రేవీ కూరల్ని ఉదయం పూట, అదీ పరగడుపున తీసుకోకూడదు. పొట్టలో తిప్పుతుంది. రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. అదే ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారానికి ప్రాధన్యం ఇవ్వాలి.

3. చాలా మంది నిద్రలేవగానే కాఫీ, టీ తాగుతుంటారు. పొద్దున వాటిని తాగడం మంచిదే. కానీ పరగడుపున తీసుకోకపోవడం ఉత్తమం. వీటిల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొదట గ్లాస్ నీళ్లు తాగి ఓ పది నిమిషాల తరువాత వీటిని తీసుకుంటే మంచిది.

4. పుల్లని పదార్థాల వల్ల ఉదయం పూట జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా టమాటాలను పరగడుపున తీసుకోరాదు. చాలా మంది టమాటా బాత్ లేదా టమాటా రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే ముందు కొన్ని పాలు తాగడమో, వేరే పదార్థమేదైనా తినడమో చేయాలి.

5. కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లిపోతారు. అలా కాకుండా ఓ కప్పు గ్రీన్ టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి ముందు కూడా ఇలాగే చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు.

6. పరగడుపున అరటి పండలు జోలికీ వెళ్లకూడదు. అరటి పండులో మెగ్నిషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

7185

More News

VIRAL NEWS

Featured Articles