రెండేళ్ల లోపు పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదట!

హైదరాబాద్ : పసిపిల్లల విషయంలో ప్రతి ఓక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి పుట్టిన కొద్ది రోజులకే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ వేస్తుంటారు. చాలా మంది పీడియాట్రిషియన్లు పిల్లలకు యాంటీబయాటిక్స్ సేఫ్ అని చెప్తుంటారు. కానీ, కొత్త స్టడీ ప్రకారం.. దానికి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. రెండేళ్ల లోపు పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల ఒబెసిటీ, అలర్జీ లాంటి అనారోగ్య సమస్యలు రావచ్చని స్టడీలు చెబుతున్నాయట.
మాయో క్లినిక్ జర్నల్‌లో పబ్లిష్ అయిన రీసెర్చ్‌లో.. 14వేల 500మంది చిన్నారుల డేటా సేకరించారు. వారిలో 70శాతం మందికి రెండేళ్ల కంటే తక్కువ వయస్సున్నప్పుడు యాంటీబయోటిక్స్‌తో ట్రీట్మెంట్ చేశారు. వారికి కాస్త పెద్దయ్యాక పెద్ద ప్రమాదమే ఉంటుందని తేలిందట.
వయస్సును బట్టి వారు తీసుకున్న డోస్ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపించిందనేది క్రమంగా బయటపడుతుంది. యాంటీబయోటిక్స్ అనేవి శరీరంలో తాత్కాలిక మైక్రోబ్స్ ను డెవలప్ చేస్తాయి. కానీ, పిల్లల్లో సుదీర్ఘ కాలానికి ఎఫెక్ట్లు చూపించొచ్చు. ఆస్తమా, ఒబెసిటీ, ఫుడ్ అలర్జీలు, హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అలర్జీ సమస్యలు, చర్మ సమస్యలు వంటివి సంభవిస్తాయని స్టడీలు చెబుతున్నాయి.
ఈ స్టడీ ఫలితాలు తెలుసుకున్న తర్వాత.. భవిష్యత్‌లో యాంటిబయోటిక్స్ ట్రీట్మెంట్ గురించి సేఫ్ టెక్నిక్‌లు తెలుసుకోవచ్చు. పిల్లల్లో యాంటిబయోటిక్స్ ఏ వయస్సులో ఎంత డోస్ ఇవ్వొచ్చనే దానిపై స్టడీలు చేసి కొంత అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
- కాచిగూడ-యలహంక ప్రత్యేక రైలు
- బ్రాహ్మణుల కోసం అపరకర్మల భవనం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
- ఓటీపీ వచ్చిందా.. రేషన్ తీసుకో..!
- వైభవంగా పెద జీయర్ స్వామి పరమ పదోత్సవం
- నిఘా కన్ను ఛేదనలో దన్ను
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు