చలికాలంలో నెయ్యి వాడడం మరువకండి..!


Wed,November 14, 2018 01:00 PM

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చలిపులి చంపేస్తోంది. ఈ సీజన్‌తోపాటే పలు అనారోగ్య సమస్యలు కూడా మనపై దాడి చేస్తున్నాయి. చాలా మంది ఇప్పటికే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడ్డారు. ఇక మరికొంత మందిని ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ చలికాలంలో నెయ్యిని వాడితే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాదు, శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

1. నెయ్యి వేడి చేసే ఆహార పదార్థాల జాబితాకు చెందుతుంది. అందువల్ల చలికాలంలో నెయ్యి తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. కూరల్లో నెయ్యి వేసుకుతింటే ప్రయోజనం ఉంటుంది.

2. చలికాలంలో చాలా మంది సహజంగానే శక్తి లోపించినట్లు నీరసంగా అయిపోతారు. అలాంటి వారు నెయ్యి తినడం అలవాటు చేసుకుంటే శక్తి బాగా లభిస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఉదయాన్నే ఉండే నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి.

3. దగ్గు, జలుబు, ముక్కుదిబ్బడలకు నెయ్యి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొంత వేడి చేసి కొన్ని చుక్కలను ముక్కులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.

4. చలికాలంలో చర్మ సంరక్షణకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. పగిలిన చర్మం నుంచి విముక్తి లభిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

5. నెయ్యి రోజూ తింటే మలబద్దకం ఉండదు. జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం వేగంగా, త్వరగా జీర్ణమవుతుంది. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

5389

More News

VIRAL NEWS

Featured Articles