ఈ కాలంలో తిన‌కూడ‌ని ఆహార ప‌దార్థాలు ఇవే..!


Mon,July 17, 2017 03:56 PM

బ‌యట హోరున వ‌ర్షం ప‌డుతుంటే.. ఆ చ‌ల్ల‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఏవైనా వేడి వేడి ఆహార ప‌దార్థాలు తింటే.. వాహ్‌.. ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది క‌దా..! వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఎవ‌రైనా అలాంటి ఆహారాన్ని తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ కాలంలో తిన‌కూడ‌ని ప‌దార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో, వాటిని ఈ కాలంలో తీసుకుంటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
fry-food

1. ఫ్రై చేసిన ఆహారం


బాగా వేయించిన ఆహార పదార్థాల‌ను ఈ కాలంలో అస్స‌లు తిన‌రాదు. ఎందుకంటే స‌హజంగానే వ‌ర్షాకాలంలో మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మంద‌గిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అటువంట‌ప్పుడు ఇలాంటి ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. దాంతో అది గ్యాస్‌, అసిడిటీకి దారి తీస్తుంది. క‌నుక ఈ కాలంలో ఫ్రై ఫుడ్స్‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. అంతేకాదు, నూనెలో బాగా వేయించిన ఆహారాన్ని కూడా తిన‌రాదు. ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
green-leafy

2. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు


అదేంటి.. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లను తిన‌వ‌ద్దంటారు. అవి మ‌న ఆరోగ్యానికి మంచివే క‌దా..? అని అడగ‌బోతున్నారు క‌దా..! అయితే మీరు అంటోంది నిజమే. కానీ ఈ కాలంలో మాత్రం ఆకుపచ్చ‌ని కూర‌గాయ‌లు, ముఖ్యంగా ఆకుకూర‌ల‌ను తిన‌రాదు. ఎందుకంటే వాటిలో క్రిములు, బాక్టీరియా ఎక్కువ‌గా చేరే అవ‌కాశం ఈ కాలంలోనే ఉంటుంది. బాగా శుభ్రం చేసుకుంటాం అనుకుంటే త‌ప్ప వాటిని తిన‌రాదు.
sea-food

3. సీ ఫుడ్‌


సాధార‌ణంగా వ‌ర్షాకాలంలోనే చేప‌లు, రొయ్య‌లు గుడ్ల‌ను పెట్టి పిల్ల‌ల్ని కంటాయి. ఈ స‌మ‌యంలో వాటిపై లార్వా, వైర‌స్‌లు, ఇత‌ర క్రిములు ఎక్కువ‌గా ఉంటాయి. ఇక మార్కెట్‌లో అమ్మే చేప‌లు, రొయ్య‌ల‌పై ఈ కాలంలో ఉండే తేమ కార‌ణంగా బాక్టీరియాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఓ ప‌ట్టాన పోవు. క‌నుక ఈ కాలంలో చేప‌లు, రొయ్య‌ల‌ను తిన‌కుండా ఉంటేనే బెట‌ర్. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌తారు.
fruit-juices

4. పండ్ల ర‌సాలు


ర‌హదారులు, హోటల్స్, రెస్టారెంట్స్‌లో అమ్మే పండ్ల ర‌సాల‌ను తాగ‌కూడ‌దు. ఎందుకంటే ఈ కాలంలో అవి తేమ కార‌ణంగా బాక్టీరియా ప్ర‌భావానికి లోన‌వుతాయి. ఇక క‌లుషిత‌మైన నీరు క‌లిసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక పండ్ల ర‌సాల‌ను కూడా తీసుకోకూడ‌దు. ఇంట్లోనే వాటిని ప్రిపేర్ చేసుకుని తాగ‌వ‌చ్చు.
cool-drinks

5. కూల్ డ్రింక్స్‌


బాటిల్స్‌, సీసాల్లో అమ్మే కూల్ డ్రింక్స్‌, ఫ్రూట్ జ్యూస్‌ల‌ను అస్స‌లు తాగ‌రాదు. వాటి వ‌ల్ల ఈ కాలంలో జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే ఎంజైమ్‌ల ప‌నితీరుకు ఆటంకం క‌లుగుతుంది. క‌నుక వ‌ర్షాకాలంలో కూల్‌డ్రింక్స్‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది.

8524

More News

VIRAL NEWS