ఆదివారం 17 జనవరి 2021
Health - Nov 24, 2020 , 19:04:20

రాత్రివేళల్లో ఇవి తినకూడదా...?

 రాత్రివేళల్లో ఇవి తినకూడదా...?

హైదరాబాద్ : ఉదయాన్నే లేవగానే మనం ఏం తింటున్నామా అనేది మన శరీరానికి చాలా ముఖ్యమని చాలా వైద్యులు చెబుతుంటారు. రాత్రంతా మెలకువగా ఉంటాం కాబట్టి పొద్దున్నే లేవగానే న్యూట్రిషయస్ ఫుడ్ తప్పక తీసుకోవాలని సూచిస్తుంటారు. అలా అని రాత్రి ఏం తింటున్నారో పట్టించుకునే పని లేదని అస్సలు కాదు. రాత్రి పడుకునే ముందు మనం ఏం తింటున్నామా అనేది కూడా చాలా ముఖ్యమని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. రాత్రి నిద్రపోయేముందు తినే ఆహారం కారణంగా చాలా మందిలో గుండెల్లో మంట, గ్యాస్, నిద్రలేమి, అధిక బరువు లాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయట. కాబట్టి రాత్రిపూట  ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, మసాలాలు కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్నింటిని రాత్రి పడుకునే ముందు అస్సలు తినకూడదని చెబుతున్నారు. అవేంటంటే...

గంజితో కూడుకున్నఆహార పదార్థాలు... 

రాత్రిపూట గంజితో కూడుకున్న ఆహార పదార్థాలు అంటే.. పాస్తా, అన్నం, బంగాళదుంపలు కలిగిన ఫుడ్ తినకూడదు. ఇవి తినడం వల్ల బ్లడ్‌లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బాడీ మెటబాలిజమ్ తగ్గిపోతుంది. ఫలితంగా మీరు ఎనర్జీని కోల్పోతారు. కాబట్టి వీటికి బదులు ప్రొటీన్లు కలిగి ఉండే ఆకుకూరలు లాంటివి తినడం మంచిదట.


కొవ్వు కలిగిన ఆహారం

డిన్నర్ టైంలో జిడ్డు ,కొవ్వుతో కూడుకున్న ఆహారం తినడం వల్ల అవి సరిగా అరగవు. అందుకే చాలా మందికి పేగుల్లో ఇబ్బందులు ఏర్పడి గ్యాస్ సమస్యలు ఎదురవుతుంటాయి.


-మసాలా ఫుడ్...

రాత్రిపూట మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే.. గుండెల్లో మంట పుడుతుంది. చాతికింది భాగంలో నొప్పి కూడా వస్తుంది. ఈ నొప్పి ఆహారం అరగకపోతే నొప్పిని పోలి ఉంటుంది. ముందు ముందు ఇది పెద్ద సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణుల హైచ్చరిక.

-కార్బోహైడ్రెట్స్...

 కార్బోహైడ్రెట్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. రాత్రి పూట వాటికి దూరంగా ఉండటమే మంచిది. డిన్నర్ టైంలో ఇవి తినడం వల్ల అవి బ్లడ్ స్ట్రీమ్‌లోకి త్వరగా వెళ్లిపోతాయి. ఇక ఉదయాన్నే ఎక్సర్సైజ్ చెయ్యకుండా ఉంటే అవి శరీరంలో కొవ్వుగా మారి అలాగే నిలువ ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి  నైట్ టైంలో పిజ్జాలు, సోడాలు, పాస్టా, ఆలు లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మేలు.

- చాక్లెట్స్... 

చాక్లెట్లలో ఉండే కెఫైన్ నిద్ర పట్టుకుండా చేస్తుంది. అంతేకాదు కెఫైన్ తీసుకోవడం వల్ల రెస్ట్‌లెస్‌నెస్, నీరసం, వికారం, స్టమక్ ఇరిటేషన్స్ లాంటివి వాటికి కారణమవుతుంది. దీంతో పాటు కెఫైన్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల హార్ట్‌రేట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.

దీన్ని బట్టి మనం అర్థచేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మన ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నామా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి తినేముందు కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించుకుని తినాలని నిపుణులు చెబుతున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.