సోమవారం 18 జనవరి 2021
Health - Nov 29, 2020 , 21:43:54

శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!

శృంగారానికి ముందు వీటిని అస్సలు తినకండి..!

శృంగారంలో ఎక్కువసేపు గడపాలని.. భాగస్వామిని బాగా సంతృప్తి పరచాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ వారికి తెలియకుండానే ప్రతిసారి ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. సంభోగానికి మధ్యలోనే ఆటంకం రావడానికి కారణమేంటో అర్థంకాక, ఎవరిని అడగలేక లోలోపల  బాధపడుతుంటారు. అయితే నిపుణులు చెబుతున్న కొత్త విషయం ఏంటంటే.. మన ఆహారపు అలవాట్లు కూడా శృంగారానికి ఆటంకాలుగా మారతాయట. ముఖ్యంగా సంభోగానికి ముందు తినకూడనివి కొన్ని ఉన్నాయట. అవేంటో చూద్దాం..

కాఫీ : సెక్స్ చేయడానికి ముందు కాఫీ తాగకపోవడం చాలా మంచిది. దీంట్లోని కెఫిన్ కార్టిసాల్ హార్మోన్లపై ఒత్తిడి పెంచి.. హార్మోన్ల సమతుల్యతను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 ఉప్పు : శృంగారానికి ముందు ఎప్పుడూ ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఉప్పు కడుపు ఉబ్బరంగా ఉంచి.. శృంగార సమయంలో మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సంతృప్తిని ఇవ్వకుండా చేస్తుంది.

ఉల్లిపాయ : రాత్రి వేలల్లో మీ ఆహారంలో ఎక్కువ ఉల్లిపాయను చేర్చుకుంటే, సంభోగ సమయంలో  మీ శరీరం ఉల్లిపాయ వాసన వస్తుంది. ఇది మీ భాగస్వామికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

పుదీనా : ముద్దు పెట్టుకునేటప్పుడు సువాసన రావాలనే ఆలోచనతో చాలా మంది చూయింగమ్ లేదా పుదీనా ఆకులు తింటుంటారు. ఇలా చేయడం వల్ల సెక్స్ లో ఆటంకాలు కలుగుతాయి. పుదీనాలోని మెంతోల్ అనే ముడి పదార్థం సంభోగంపై ఆసక్తిని తగ్గిస్తుంది.

కాలీఫ్లవర్, క్యాబేజీ  : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ లాంటి వాటిని శృంగారానికి ముందు తినకపోవడమే మేలు. ఇవి లైంగిక సంపర్క సమయంలో అధిక వాయువును కలిగిస్తాయి. 

జున్ను : పాల పదార్జాలు ముఖ్యంగా జున్ను హార్మోన్ల సమతుల్యతను బాగా ప్రభావితం చేస్తాయి. శృంగారానికి ముందు ఇవి తినడం వల్ల లైంగిక సంతృప్తి ఉండదు.

సోయా పాలు : సోయా పాలలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ, దీనిని తాగడం వల్ల మగ లిబిడో తగ్గుతుంది. కారణం అందులోని ఫైటో-ఈస్ట్రోజెన్‌లు. ఇవి పురుషుల శరీరంలో పెద్ద మొత్తంలో హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.