మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 07:33:46

దోమ‌కాటుతో క‌రోనా వ్యాపిస్తుందా? ఇందులో నిజమెంత‌!

దోమ‌కాటుతో క‌రోనా వ్యాపిస్తుందా? ఇందులో నిజమెంత‌!

క‌రోనా భ‌యంతో వాట్స‌ప్‌, సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్న వ‌దంతువుల‌ను న‌మ్మి మ‌రింత భ‌య‌ప‌డుతున్నారు. లేనిపోని భ‌యాల‌ను పోస్ట్ చేస్తున్న వారిపై అధికారులు చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నారు. అప్ప‌టి నుంచి త‌ప్పుడు ప్ర‌చారం కొంత‌మేర‌కు ఆగింది. అయిన‌ప్ప‌టికి ప్ర‌జ‌ల్లో కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. దోమ‌ల నుంచి అనారోగ్యానికి గుర‌వుతున్నారు. వాటి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఆయా గ‌ల్లీల‌లో దోమ‌ల‌మందు కొడుతుంటారు.

మ‌రి ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డలాడిస్తున్న కొవిడ్ - 19 సోకిన వ్య‌క్తిని కుట్టిన దోమ ఇత‌రుల‌ను కుడితే వారికి కూడా వైర‌స్ వ‌స్తుందా అన్న సందేహం అంద‌రినీ క‌లిచివేస్తున్న‌ది. అయితే.. ఇందులో వాస్త‌వం ఏ మాత్రం లేద‌ని వైద్యులు కొట్టిపారేశారు. దోమ‌కాటుతో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌ద‌ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్ప‌ష్టం చేసింది. ఇది శ్వాస‌కోస‌కు సంబంధించిన‌ది. ద‌గ్గు, తుమ్ములు, లాలాజ‌లం ద్వారా బాధిత వ్య‌క్తి నుంచి మ‌రో వ్య‌క్తికి ఈ వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంటుంది.


logo