ఆడవాళ్లకేనా.. మగవాళ్లకి చర్మసౌందర్యం వద్దా?

ఆడవాళ్లకు మాత్రమే కాదు మగవారికి చర్మం సౌందర్యం ముఖ్యమే. వారికి కూడా అందంగా ఉండాలి.. అందరినీ ఆకట్టుకోవాలి అని కొన్ని ఆశలుంటాయి. అలాంటి వారు చలికాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.. చలికాలం అంటే చాలా మందికి ఇష్టం. ఎండ వేడి నుంచి, చమట, చికాకు లాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చని. కానీ చలికాలంలో చర్మం పొడి బారిపోకుండా ఉండటానికి ఆడవారితో పాటు మగవారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని చర్మవైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
గీకుతూ షేవ్ చేసుకొవడం వద్దు
సాధారణంగా మగవారు షేవింగ్‌కు ముందు చర్మాన్ని బాగా గీకుతుంటారు. షేవ్ చేసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలు చచ్చిపోవడమే కాక.. ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి నిజమే. కానీ బరాబరా గీకుతూ.. షేవ్ చేసుకోవడం అస్సలు మంచిది కాదట. అంతేకాదు.. షేవింగ్ చేసుకునే ముందు లైట్ వేట్ క్రీమ్ లేదా లోషన్ రాసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
షేవింగ్ టూల్స్ క్లీన్‌గా ఉంచాలి
షేవింగ్ టూల్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే.. షేవ్ చేసుకున్నప్పుడు వాటిలోకి మురికి, నూనె, చర్మంలోని మృతకణాలు వెళ్తుంటాయి. వీటిని అలాగే ఉంచేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేవింగ్ టూల్స్‌ను ఎప్పటికప్పడు ఆల్కహాల్‌తో క్లీన్ చేసుకోండి.
సన్‌స్క్రీన్
సన్‌స్క్రీన్ ఆడవారితో పాటు మగవారికి కూడా చాలా ముఖ్యం. చలికాలం అయినప్పటికీ.. ఇది మీ చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి బయట దుమ్ము, ధూళి, పొల్యూషన్ లాంటివి చర్మం లోతుల్లోకి వెళ్లకుండా మీ చర్మానికి రక్షణ పొరలాగా పని చేస్తుంది.
ఇంట్లోకి హ్యుమిడిఫైర్ తీసుకొండి
చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనే బదులు మీ రూంలోకి మంచి హ్యుమిడిఫైర్ (తేమను అందించేది) కొనుక్కువడం మంచిది. ఎందుకంటే మీ చర్మానికి ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి.. మృదువుగా అందంగా ఉంచుతుంది.
గోరువెచ్చటి నీరు మంచిది
చలిగా ఉంది కదా అని వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. ఇవి చర్మంలోని సహజ నూనెల్ని పోగొడతాయట. నిజానికి ఎప్పుడైనా స్నానానికి గోరువెచ్చటి నీళ్లే మంచివని నిపుణుల సలహా.
లిప్ బామ్
మగవాళ్లకి కూడా లిప్ బామ్ చాలా అవసరం. చెప్పాలంటే పెదవులు పగిలి మంట రావడం అనేది ఆడవాళ్లకంటే మగవారిలోనే కాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి పెదవులు పొడిబారినప్పుడల్లా దీన్ని రాసుకుంటే మంచిదని చర్మవైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
- అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- బిలియనీర్ జాక్‌మా కనిపించారు..