జంక్ ఫుడ్ అతిగా తింటే..


Tue,May 22, 2018 07:46 PM

ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తింటే సంతానలేమి సమస్యలు తప్పవు. ఫాస్ట్‌ఫుడ్ గురించి ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ఏం చెప్తుందంటే?
ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా తినే మహిళల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనంలో తెలిసింది. ఆడిలైడ్‌లోని రాబిన్‌సన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఫాస్ట్‌ఫుడ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. అతిగా జంక్‌ఫుడ్ తింటూ పండ్లను తక్కువగా తినేవాళ్లలో సంతానలేమి సమస్య ఉన్నట్లు గుర్తించారు. వీరు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూకే, ఐర్లాండ్ దేశాలకు చెందిన 5,598 మంది మహిళలపై పరిశోధనలు జరిపారు. వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకున్నారు. ఫాస్ట్‌ఫుడ్ తక్కువగా తీసుకుంటూ పండ్లను ఎక్కుగా తింటున్న వారిలో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి తక్కువ సమయంలోనే గర్భం దాల్చారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, చేపలు వంటివి సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయని, పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ వంటివి సంతాన లేమిని పెంచుతాయని ఈ అధ్యయనం తేల్చింది.

4746

More News

VIRAL NEWS