శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Apr 15, 2020 , 12:43:36

ఏసీని వాడుతున్నారా..?

ఏసీని వాడుతున్నారా..?

కరోనా వ్యాప్తి నివారణ కోసం దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా మే నెల కూడా మొదలు కాలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.  ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. ఐతే ఏసీలతో కొంతమంది ఇబ్బందులను ఎదుర్కొంటారని వైద్యులు పేర్కొంటున్నారు. ఏసీని ఎక్కువగా పెంచుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, న్యుమోనియా,  వంటి జబ్బులు వచ్చే ముప్పు ఉంది.  

 -ఏసీ ఆన్ చేయగానే తలుపులు మూసేస్తాం. అందువల్ల మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ మనమే పీలుస్తుంటాం. దీంతో ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

-రోజూ ఆరు గంటలకంటే ఎక్కువ ఇలా ఏసీ గదుల్లో గడిపితే మైగ్రేన్‌గా మారే అవకాశం ఉంది.

- ఏసీ వల్ల లోబీపీ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి శరీరం త్వరగా అలసిపోతుంది.

-ఏసీలో ఎంత కూలింగ్ పెరిగితే శరీరానికి అంత ప్రమాదం. చల్లదనం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.

-ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఏసీవల్ల చర్మం పొడిబారుతుంది.

-ముక్కు దిబ్బడ, గొంతు గరగర, వైరల్ అలర్జీస్ వంటివి వ్యాపిస్తాయి. వీలైనంత వరకు ఏసీ వాడకుండా ఉండడమే మంచిది. ప్రత్యామ్నాయంగా ఫ్యాన్ వాడొచ్చు.

-ఏసీ వల్ల అస్తమా లాంటి దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు. నీరసం, నిస్సత్తువ, డిప్రెషన్ వంటి సమస్యలు కృత్రిమ చల్లదనం ఇచ్చే ఏసీల వల్లే వ్యాపిస్తాయి.

-ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే మనం ఏసీని తక్కువగా వినియోగిస్తేనే మంచిది.

-తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా బయటి వాతావరణంలో గడపాలి. తలుపులు, కిటికీలు తెరచి సహజసిద్ధమైన గాలిని లోపలికి రానిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

-శరీరంలోంచి చెమట బయటకొస్తేనే మంచిది. ఏసీ వాడడం వల్ల శరీరంలోంచి చుక్క చెమట కూడా బయటకు రాదు.


logo