వారంలో బ‌రువు త‌గ్గాలా..? ఈ డైట్ పాటించండి..!


Thu,December 14, 2017 11:04 AM

నేటి త‌రుణంలో అధిక బ‌రువు స‌మస్య అనేది చాలా మందిని బాధిస్తోంది. అధికంగా పెరిగిపోయిన బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే వాటితో పాటు కింద చెప్పిన విధంగా ఒక వారం రోజులు డైట్ పాటిస్తే దాంతో వారంలోనే అధిక బ‌రువును చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ కింద పేర్కొన్న పద్ధతిలో ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ డైట్ ప్లాన్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మొదటి రోజు అరటిపండు తప్ప అన్ని రకాల తాజా పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీకు నచ్చిన, ఇష్టమైన అన్ని రకాల పండ్లను తినవచ్చు. ప్రధానంగా పుచ్చకాయలు, కీర దోసకాయలు ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. ఎంత తినాలనిపించినా తినొచ్చు. పళ్లను ఆహారంగా తీసుకుంటే రాబోయే 6 రోజులకు శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి.

2. రెండవ రోజు కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద ఆలుగడ్డను ఉడికించి తినాలి. అనంతరం మళ్లీ దాన్ని తినకూడదు. మిగతా అన్ని కూరగాయలు పచ్చివి లేదా ఉడికించినవి తినొచ్చు. నూనె వాడకుండా కేవలం ఉప్పు, కారం మాత్రమే వాడుతూ కూరగాయలను తినాలి. నచ్చినంత తినొచ్చు.

3. మూడో రోజు అరటిపండు, ఆలుగడ్డ తప్ప మిగిలిన పండ్లు, కూరగాయలు కలిపి తీసుకోవాలి. మీకు కావల్సినంత తినండి. దీంతో శరీరంలో ఉన్న అదనపు కొవ్వు నిల్వలు కరగడం ప్రారంభమవుతాయి.

4. నాలుగో రోజు 8 అరటిపండ్లు, 3 గ్లాసుల పాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు ఎక్కువ ఆకలిగా ఉండదు. రోజంతా హాయిగా ఉండడం గమనిస్తారు. 8 అరటిపండ్లు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పవచ్చు. తగ్గించి తింటే ఇంకా మంచిది. ఏదైనా ద్రవాలను తాగాలనిపిస్తే 100 ఎంఎల్ వరకు కూరగాయల సూప్ తాగవచ్చు. అది కూడా కేవలం ఇంట్లో తయారు చేసినదైతేనే వాడండి.

5. ఐదో రోజు ఒక కప్పు అన్నం, 6 టమాటాలను తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాంట్లోకి కూరగాయలు లేదా ఆకుకూతో నూనె లేకుండా వండిన కూర తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు 2 టమాటాలు తీసుకోవాలి. రాత్రికి కప్పు అన్నం మాత్రమే తినాలి.

6. ఆరో రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ల రసం తీసుకోవాలి. రెండో రోజు తిన్నట్టు పచ్చివి లేదా వంటిన కూరగాయలు (ఆలుగడ్డ మినహా) తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు తిన్నట్టే తినవచ్చు. కూరగాయలకు పరిమితి లేదు. ఈ రోజు కూడా ఆకలి అయినట్టు అనిపించదు.

7. ఏడవ రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ల రసం తీసుకోవాలి. 6వ రోజులాగే తింటూ కూరగాయలను కొద్దిగా తగ్గించి, చక్కెర లేకుండా పళ్ల రసం తీసుకోవాలి. మధ్యాహ్నం యథావిధిగా ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినాలి.

ఈ ఆహార నియమావళిని పాటిస్తే వారం రోజుల తరువాత శ‌రీర‌ బరువులో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది.

12378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles