శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Sep 14, 2020 , 22:05:54

ఎముకలు గట్టిపడాలంటే ఇలా చేయండి..!

ఎముకలు గట్టిపడాలంటే ఇలా చేయండి..!

హైదరాబాద్‌: చిన్నా, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. వెన్నునొప్పితోనూ సతమతమవుతున్నారు. ఎముకలు పెలుసుగా మారడంతో చిన్న దెబ్బతగిలినా విరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైలే. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడంతో ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతున్నాయి. యవ్వనంలో ఉండగానే ఎముకలను దృఢంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు అవసరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మరి ఎముకలు పటిష్టంగా ఉండాలంటే మన శరీరంలో కాల్సియం, విటమిన్‌ డీ ఉండాలి. ఇవి ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎముకలు బలపడతాయి. ప్రతి వ్యక్తికి రోజుకి కనీసం ఒక గ్రాం కాల్షియం అవసరపడుతుంది. దాన్ని పొందాలంటే వీటిని ప్రతిరోజూ తీసుకోవాలి.

  • పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
  • ప్రతిరోజూ పాలు తాగాలి. డైట్‌ పాటించాలనుకునేవాళ్లు స్కిమ్‌డ్‌ మిల్క్‌ తాగాలి.
  • బాదం, పిస్తా, నువ్వులు, పప్పులు తినాలి.
  • రాగులు, మొక్కజొన్న మొదలైన చిరుధాన్యాలు తీసుకోవాలి.
  • సీతాఫలం, సపోటా లాంటి పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తింటూ ఉండాలి. 
  • ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి.
  • చికెన్‌, మటన్‌ లివర్‌ తినాలి.
  • వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినాలి.
  • రోజుకు కనీసం రెండు కోడిగుడ్లు తినాలి.
  • పాలకూర తరచూ తీసుకోవాలి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo