గురువారం 01 అక్టోబర్ 2020
Health - Sep 05, 2020 , 20:34:23

గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ ఉందా? ఇది కూడా క‌రోనా వైర‌స్‌కు దారితీయ‌వ‌చ్చు!

గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ ఉందా? ఇది కూడా క‌రోనా వైర‌స్‌కు దారితీయ‌వ‌చ్చు!

క‌రోనా ల‌క్ష‌ణాలు అంటే.. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, వాస‌న కోల్పోవ‌డం వంటివి మాత్ర‌మే తెలుసు. తాజాగా నోటి పూత‌, అల్స‌ర్లు, వాంతులు, విరేచ‌నాలు, క‌డుపులో మంట‌, వికారం వంటి ల‌క్ష‌ణాలు కూడా వైర‌స్‌కు దారితీయ‌వ‌చ్చు అంటున్నారు. ఉన్న‌వి స‌రిపోక మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయని కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిరినాథ్ అంటున్నారు. అంతే గ్యాస్ట్రిక్ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు హా.. ఏం కాదులే అని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం మంచిదంటున్నారు.

ఈ విష‌యాలన్నీ తెలియ‌క చాలామంది వీటికి క‌రోనాకు సంబంధం లేద‌ని హాయిగా ఉంటున్నారు. అలా వ‌దిలేయ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ మ‌రింత ముదిరి ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. వైర‌స్‌కు గుర‌య్యే 100 మందిలో 20 మందికి జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డ‌మే లేదు. వారికి భిన్నంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్ల‌మ్‌, క‌డుపుబ్బ‌రం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. అందుకే క‌రోనా స‌మ‌యంలో శ‌రీరంలో వ‌చ్చే ప్ర‌తిమార్పును గ‌మ‌నిస్తూ వాటికి చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలా అని వ‌చ్చిన ప్ర‌తి జ‌బ్బుకు భ‌య‌ప‌డి క‌రోనాకు మ‌రింత లొంగ‌కూడ‌దు. 


logo