శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 15, 2020 , 20:22:51

కరోనా నుంచి బయట పడ్డ వారికి డయాబెటిస్‌ ముప్పు!

కరోనా నుంచి బయట పడ్డ వారికి డయాబెటిస్‌ ముప్పు!

జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారపర్యంగా మాత్రమే డయాబెటిస్‌ వస్తుందని తెలుసు. తాజాగా కరోనా వైరస్ వల్ల కూడా కొత్తగా మధుమేహం వస్తుందని పరిశోధనలో తేలినట్లు తెలుస్తోంది. వైరస్ సోకి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వ్యాధులు వెంటాడుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోగులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించిన స్టడీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 'coviDiab' అనే ప్రాజెక్ట్‌ కింద 17 మంది అంతర్జాతీయ డయాబెటిస్‌ నిపుణుల బృందం, మోనష్‌ యూనివర్శిటీకి చెందిన డయాబెటిస్‌ ప్రొఫెసర్‌ పౌల్‌జిమ్మెట్‌ సంయుక్తంగా కరోనా బాధితులపై పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా కరోనా బాధితుల్లో చక్కెర స్థాయిలు, మధుమేహం వచ్చే అవకాశాలు తదితర అంశాలను పరిశీలించారు.

బాధితులపై వైరస్‌ రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. ఒకవైపు మధుమేహం ఉన్న వ్యక్తులకు ఈ వైరస్‌ మరింత ప్రమాదకారి. మరోవైపు వైరస్‌ సోకిన వ్యక్తులకు కొత్తగా మధుమేహం కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కొవిడ్‌-19 కేసుల్లో మరణాల్లో 20 నుంచి 30 శాతం మంది మధుమేహం రోగులు ఉన్నారు.


logo