మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Apr 01, 2020 , 18:35:02

ఢిల్లీలో క్వారంటైన్ ఉల్లంఘనుల మొబైల్ ట్రాకింగ్

ఢిల్లీలో క్వారంటైన్ ఉల్లంఘనుల మొబైల్ ట్రాకింగ్

హైదరాబాద్: క్వారంటైన్ లో ఉండేవారు బయటికి రావద్దు. వాళ్లనూ, వీళ్లనూ కలవొద్దు.. కానీ చాలామంది ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇకనుంచి అలాంటివారి ఆటలు సాగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. క్వారెంటైన్ వ్యక్తుల మొబైల్ నంబర్లను ట్రాక్ చేస్తామని ఆయన ప్రకటించారు. మొబైల్ ట్రాకింగ్ వల్ల క్వారంటైన్ ఉల్లంఘనల గురించి తెలుస్తుందని, అంతేకాకుండా వారు ఎవరెవరిని కలుసుకున్నదీ బయటపడుతుందని చెప్పారు. మంగళవారం 11 వేలు, బుధవారం 14 వేలు మొత్తం 25 వేల నంబర్లను ఢిల్లీ పోలీసులకు అప్పగించామని వివరించారు. సింగపూర్, దక్షిణ కొరియాను స్ఫూర్తిగా తీసుకుని సాంకేతికతను వినియోగించుకునే క్రమంలో ఫోన్ ట్రాకింగ్ చేపట్టినట్టు తెలిపారు. నిజానికి చైనా మొదట ఈ ట్రాకింగ్ చేపట్టింది. తర్వాత సింగపూర్, దక్షిణ కొరియా దీనిని అమలు చేశారు. యూరప్‌లోనూ విస్తారంగా  వినియోగిస్తున్నారు. ఇలా ట్రాక్ చేయడం వ్యక్తిగత ఏకాంతానికి భంగం కలిగించినట్టు కాదని బ్రిటన్ డేటా, ప్రైవసీ అథారిటీ తేల్చిచెప్పింది.


logo