బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 20, 2020 , 15:10:27

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

దాదాపు రెండు నెలలు.. అన్నీ బందయి.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిపుడే జనజీవనం మళ్లీ మొదలయింది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన జనం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు. బస్సులు తిరుగుతున్నాయి. షాపులు తెరుచుకున్నాయి. ఆటోలు నడుస్తున్నాయి.. మార్కెట్లలో సందడి షూరూ అయింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బుకింగ్‌లు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండామనల్ని మనం కాపాడుకోవచ్చు. మన తోటివారిని, ఇరుగుపొరుగువారికి ఇబ్బంది కలగించకుండా ఉండొచ్చు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?..క్యాష్‌ ఆన్‌ డెలివరీ తీసుకుంటున్నారా?..అయితే చాలా జాగ్రత్తగా ఉండండి..డెలివరీ బాయ్‌ల ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదముంది.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌ కరోనా ఫ్రూఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.

-కాంటాక్ట్‌లెస్‌ డెలివరీని ఎంచుకోవడం సేఫ్‌.. అంటే.. మీ ఆర్డర్‌ను డోర్‌వద్ద వదిలేసి డోర్‌ బెల్‌  మోగించమని డెలివరీ బాయ్‌కి చెప్పండి. కాల్‌చేసి కన్‌ఫామ్‌ చేసుకోండి.. అతను వెళ్లిన తరువాత తీసుకోండి

-క్యాష్‌ ఆన్‌ డెలివరీకి బదులు ముందే ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించండి.. ఒకవేళ  క్యాష్‌ ఇవ్వాల్సి వస్తే ఆర్డర్‌ మొత్తం ఎంతో దానికి సరిపడా చిల్లరతో సహా ఇవ్వండి. 

-ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసే ముందు డెలివరీ కంపెనీల హైజీన్‌ రేటింగ్‌ చూడాలి. సురక్షితమైన పద్ధతిలో డెలివరీ చేసే కంపెనీలను మాత్రమే ఎంచుకోండి.

-ఆన్‌లైన్‌ ద్వారా డెలివరీ తీసుకు వస్తువులను ముందుగా ఒక కంటైనర్‌లో ఉంచండి. ముఖానికి మాస్క్‌ ధరించి ప్యాకింగ్‌ను విప్పండి. ప్యాకింగ్‌ చెత్తను వెంటనే డస్ట్‌బిన్‌లో పారేయండి. అనంతరం 

చేతులను సబ్బుతో కడుక్కోండి. 

-ప్యాకింగ్‌ విప్పిన తరువాత మీ వస్తువును శానిటైజర్‌ స్ప్రే చేసిన గుడ్డతో తూడవండి(తినే వస్తువులకు ఇది వర్తించదు). మరొక్కసారి మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి.

-ఆహార పదార్థాలను ఆన్‌లైన్‌ ద్వరా ఆర్డర్‌ చేయకపోవడమే మంచిది. ఒక వేళ చేస్తే డెలివరీ చేసిన ఫుడ్‌ వేడిగా ఉందోలేదో చూసుకోండి. లేకపోతే వేడి చేసి తినండి

-కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఆన్‌లైన్లో తెప్పించుకుంటే వాటిని కాసేపు ఉప్పునీళ్లలో ఉంచి కడగాలి


logo