బుధవారం 03 జూన్ 2020
Health - Apr 02, 2020 , 12:28:44

స్టోర్‌లో దగ్గాడు.. ఉగ్రవాద బెదిరింపు కేసు

స్టోర్‌లో దగ్గాడు.. ఉగ్రవాద బెదిరింపు కేసు

హైదరాబాద్: అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో ఓ వ్యక్తి సూపర్ మార్కెట్‌లో హల్‌చల్ చేశాడు. కావాలని ఎడాపెడా దగ్గుతూ.. బాటిల్ కూలర్‌పై ఊపిరి ఊది ఆ తేమపై కరోనా అని రాసి భయాందోళనలు సృష్టించాడు. అతడు గలాటా సృష్టిస్తుండగా స్టోర్ సిబ్బంది పోలీసులను పిలిపించారు. క్యూబాకు చెందిన జాన్ స్వాలర్ (33) అనే ఆ వ్యక్తిని అరెస్టు చేసి, అతనిపై ఉగ్రవాద బెదిరింపుల కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. తర్వాత స్టోర్ మూసేసి శానిటైజ్ చేశారు. అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే సదరు దుండగునికి కరోనా లేదని అతని తండ్రి పోలీసులకు చెప్పాడు. అఇయినా పోలీసులు రక్షమ దుస్తులు ధరించి మరీ దుండగుడిని తోలుకుపోయారు.


logo