శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 20, 2020 , 16:14:23

మీకు కరోనా ఉందని తెలిపే సంకేతాలివే..

మీకు కరోనా ఉందని తెలిపే సంకేతాలివే..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల నిష్పత్తి ఆశ్చర్యకరమైన రీతిలో పెరుగుతున్నది. 80 శాతానికి పైగా ప్రజలు తేలికపాటి ఇన్ఫెక్షన్లకు గురయ్యారు. చాలా మంది వ్యక్తులు ఇప్పటికే ఈ వైరస్‌కు గురై ఉండవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది తమకు తెలియకుండానే వైరస్‌తో పోరాడి దానిని విజయవంతంగా ఓడించారు. కొవిడ్‌-19 వ్యాధికి గురైనవారు కోలుకోవడం వారి శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నదనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా లేనట్లయితే.. కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కరోనా వైరస్‌ సంకేతాలు, లక్షణాల గురించి అవగాహన ఉన్నప్పటికీ.. కొన్ని లక్షణాలు మాత్రం చాలా తేలికగా ఉంటాయి. వీటిని గుర్తించడంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.

3 రోజులకన్నా ఎక్కువ జ్వరం ఉందా?

జ్వరం 99-100 డిగ్రీల వరకు మూడు రోజులపాటు ఉండటం కొవిడ్‌ సంక్రమణకు సంకేతంగా భావించాలి. తలనొప్పి, ముక్కు కారటం, ముక్కు దురద వంటి సమస్యలు కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం.. ధ్రువీకరించబడిన కొవిడ్ కేసుల్లో దాదాపు 87 శాతం మందిలో జ్వరం అకస్మాత్తుగా సంభవించినట్లు తెలుస్తున్నది. 

వాసన శక్తిని కోల్పోతున్నారా?

వాసనలను గుర్తించడంలో మార్పు కనిపించిందంటే కొవిడ్‌ సంక్రమణకు లక్షణంగా భావించాలి. అనోస్మియా అని కూడా పిలువబడే ఈ వాసన, రుచిని కోల్పోవడం చాలా తక్కువ ఇన్ఫెక్షన్లలో కనిపిస్తుంది. వైరల్ అవశేషాలు ముక్కులోని శ్లేష్మ పొరపై దాడి చేసినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొబ్బరి, పిప్పరమెంటు నూనెతో పాటు కొవిడ్‌ రోగులు గుర్తించలేని నిర్దిష్ట వాసనలు ఉన్నాయని, ఇన్ఫెక్షన్ తొలగిపోయిన తర్వాత నెలల తరబడి వాసన తగ్గుతుందని కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ సమస్య రావడం లేదా ఆకలి తగ్గుతున్నట్లు అనిపించడం కొవిడ్‌-19 అని భావించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు.

పొడి దగ్గు కూడా లక్షణమే

కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న ముఖ్య లక్షణం పొడి దగ్గు. కొంతమందిలో గొంతు నొప్పితో కూడిన పొడి, కఠినమైన దగ్గు ఈ వైరస్‌ క్రియాశీల సంక్రమణకు సూచికగా ఉంటుంది. తేలికపాటి కేసుల్లో దగ్గు మాత్రమే ఉండి.. మరే ఇతర సంకేతాలు కనిపించకపోవచ్చు. పొడి దగ్గు సాధారణంగా అలెర్జీలు, బయటి కాలుష్య కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి, ఖచ్చితమైన అలెర్జీ సీజన్ కానప్పుడు పొడి దగ్గు వస్తున్నట్లయితే అది కొవిడ్‌-19 అనుకోవాలి.

కండ్లకలక ఉన్నదా?

గోకడం, ముక్కు కారటం, పింక్‌ ఐ వంటి సమస్యలు కనిపించడం కూడా కరోనా వైరస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. సార్స్‌-కొవ్‌-2 వైరస్ ద్వారా ఆజ్యం పోసిన తేలికపాటి కండ్లకలక సంకేతంగా ఉంటుంది. మురికి చేతులతో ముఖం చుట్టూ కండ్లు, చర్మాన్ని తాకినప్పుడు లేదా ఏరోసోల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందడానికి ఇదొక మార్గంగా చెప్పుకోవాలి.

చర్మపు దద్దుర్లు కనిపిస్తే..

చర్మపు దద్దుర్లు, కొవిడ్‌ టోస్‌.. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కనిపిస్తాయి. ఈ సరికొత్త లక్షణం ప్రజలను గందరగోళంలో పడేస్తున్నది. శరీరంలో చురుకైన మంటను కలిగించినప్పుడు చేతులు, పొట్ట, పాదాలు లేదా కాలి చుట్టూ చర్మం ఎర్రగా మారడం, ఉబ్బడం, దురద వంటివి సంభవింవిస్తాయి. పిల్లల్లో ఇలాంటి సంకేతాలను పరీక్షిస్తూ ఉండటం వలన వారిలో కొవిడ్‌ రాకుండా చూసుకోవచ్చు.

ఛాతీలో నొప్పి.. ఊపిరి సమస్య

ఊపిరి ఆడకపోవడం అనేది ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సంకేతంగా ఉంటుంది. ఇలాంటి వారికి వెంటనే వైద్య సహాయం అవసరం. దగ్గు లేదా జలుబుతో కలిసి ఉంటే తేలికపాటి కొవిడ్‌ సంక్రమణ సంకేతాలలో ఒకటిగా గుర్తించాలి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో నీలి పెదవులు, అసౌకర్యంగా ఉండటం, గందరగోళం, జ్ఞానం క్షీణించడం వంటి సమస్యలు వస్తాయి.

ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయంటే కొవిడ్‌-19 అని ఖచ్చితంగా భావించాలి. అయితే జనవరి నుంచి ఏప్రిల్ మాసాల వరకు కరోనా సంక్రమణ జరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. 2019 నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన కేస్ హిస్టరీలు చాలా తేలికపాటి రూపాల్లో కొవిడ్‌ ప్రసరణకు సూచికగా ఉండవచ్చని సూచించాయి.

ధ్రువీకరణకు మార్గం ఉందా?

యాంటీబాడీలను నిర్మించడం ద్వారా శరీరం కొవిడ్‌-19 నుండి రక్షిణ పొందుతుంది. శరీరం వైరస్‌తో పోరాడినప్పుడు దాని ప్రోటీన్‌లను గుర్తించి.. వాటికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఇచ్చే సంక్రమణ-పోరాట యాంటీబాడీలను సృష్టించినప్పుడు ప్రతిరోధకాలు అభివృద్ధి చెందుతాయి. యాంటీబాడీ పరీక్షలను చేసుకోవడం ఒక్కటే ప్రస్తుతం దీని ధ్రువీకరణకు ఉన్న ఏకైక మార్గం. అయినప్పటికీ, అనారోగ్యానికి గురైన 2-3 నెలల తర్వాత రోగులలో యాంటీబాడీలు క్షీణించడం ప్రారంభమవుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి ఇది కూడా ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు