ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 15, 2020 , 19:29:17

మెడికల్‌ మాస్క్‌.. క్లాత్ మాస్క్‌! ఏది బెటర్‌?

మెడికల్‌ మాస్క్‌.. క్లాత్ మాస్క్‌! ఏది బెటర్‌?

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మాస్కులు ధరించడం తప్పనిసరి అయిన నేపథ్యంలో ప్రజల్లో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట్లో మెడికల్‌ మాస్కులు రాగా ఇటీవల మార్కెట్లోకి క్లాత్‌తో తయారు చేసిన మాస్కులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) కొన్ని సూచనలు ఇచ్చింది.

ప్రజలు ఎలాంటి మాస్కులైనా వాడొచ్చు. అయితే.. మెడికల్‌ మాస్కులను కేవలం హెల్త్‌ వర్కర్లు, కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని తెలిపింది. క్లాత్‌తో తయారు చేసిన మాస్కులను కరోనా లేనివారు వాడాలని పేర్కొన్నది. మెడికల్‌ మాస్కులు ఒకసారి వాడి పడేయాలి. క్లాత్‌ మాస్కులను ప్రతిరోజూ శుభ్రపరిచి వాడుకోవాలి. రెండు మీటర్లు కంటే ఎక్కువ దూరం పాటించడం కష్టంగా ఉండే రద్దీ ప్రాంతాల్లో తప్పకుండా మెడికల్‌ మాస్కులే ధరించాలి. అలాగే హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు కూడా మెడికల్‌ మాస్క్‌నే వాడాలి. ప్రయాణాలు చేసేవారు క్లాత్‌ మాస్కులు ధరించడం శ్రేయస్కరం


logo