శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 18:05:35

మనమంతా సిగ్గుపడాలి.. కరోనాపై కవల పిల్లల పాట

మనమంతా సిగ్గుపడాలి.. కరోనాపై కవల పిల్లల పాట

బ్యాగ్ త‌గిలించుకొని స్కూల్‌కి వెళ్లాల్సిన స‌మ‌యంలో పాటలు పాడేందుకు సిద్ధ‌మ‌య్యారు ఈ క‌వ‌ల‌లు. అందుకు కార‌ణం వీరి అమ్మానాన్నలిద్ద‌రూ డాక్ట‌ర్లే. ప్ర‌పంచాన్ని క‌రోనా ప‌ట్టిపీడిస్తున్న‌ప్ప‌టి నుంచి వీరి త‌ల్లిదండ్రులు హాస్పిట‌ల్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పిల్లల క్షేమం చూసుకోవ‌డానికి కూడా ఎవ‌రూ లేరు. కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి దేశాన్నికాపాడేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు డాక్ట‌ర్లు, పోలీసులు. వీరిని కాపాడుకునే బాధ్య‌త ఇప్పుడు మ‌న‌పైనే ఉంది. లాక్‌డౌన్‌ను అతిక్ర‌మించ‌కుండా ఇంట్లోనే ఉండాలి అంటూ ఈ క‌వ‌ల‌లిద్ద‌రూ పాట ద్వారా తెలియ‌జేస్తున్నారు. 

క‌రోనా నేప‌థ్యంలో వ‌స్తున్న పాట‌ల‌కు భిన్నంగా  పాడి వినిపిస్తున్నారు. వైర‌స్‌ గురించి ప్ర‌తి విష‌యాన్ని క్షుణ్ణంగా అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. ఇప్ప‌డీ పాట యూట్యూబ్‌లో మారుమోగిపోతున్న‌ది. మ‌న‌మంతా క‌లిసి క‌రోనాతో పోరాడుదాం అంటూ మొద‌లైన ఈ పాట అంద‌రినోటా వినిపిస్తున్న‌ది. కవలలిద్దరూ సాయిబా, సాయిషా 10వ త‌ర‌గ‌తి బోర్డ్ ప‌రీక్ష‌ల‌కు బాగా ప్రిపేర్ అయ్యారు. కానీ లాక్‌డౌన్‌ కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా పడ్డాయి. దీంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు అక్కాచెల్లెళ్లు.  దేశం కోసం డాక్ట‌ర్లు, పోలీసులు పోరాడుతుంటే ప్ర‌జ‌లు మాత్రం దానిని విస్మ‌స్తున్నారు. ఇందుకు మ‌న‌మంతా సిగ్గుప‌డాలంటూ ఈ పాట ద్వారా తెలియ‌జేస్తున్నారు సాయిబా, సాయిషా. 
logo