సోమవారం 28 సెప్టెంబర్ 2020
Health - Apr 23, 2020 , 16:50:47

కరోనా రోగుల్లో ఆ లక్షణాలు చూసి డాక్టర్లు విస్తుపోయారు

కరోనా రోగుల్లో ఆ లక్షణాలు చూసి డాక్టర్లు విస్తుపోయారు

హైదరాబాద్: మార్చి చివరలో కరోనా విజృంబిస్తుంటే న్యూయార్క్ డాక్టర్లకు రోగుల రక్తంలో కనిపించిన మార్పులు దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఒక్కో పేషంటుకు ఒక్కో శరీరభాగంలో రక్తం చిక్కబడిపోవడం, గడ్డకట్టడం చూసి వారికి ఏమీ పాలుపోలేదు. వైరస్ శరీరాన్ని కుళ్లబొడిచే మార్గాల్లో ఇదొకటని తెలుసుకుని వైద్య ప్రపంచం నివ్వెరపోయింది. మౌంట్ సినాయ్ హాస్పిటల్‌లో కిడ్నీ డయాలసిస్‌కు ఉపయోగించే కేథటర్లపై గడ్డకట్టిన రక్తం ఉండడం మూత్రపిండాల వైద్యులు గమనించారు.

ఇక ఊపిరితిత్తులలోని కొన్ని భాగాల్లో రక్తం చుక్క లేకపోవడం పల్మనాలజిస్టులు గమనించారు. న్యూరో సర్జన్లకు రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే స్ట్రోక్స్ కేసులు, అదీ పిన్నవయస్కుల్లో ఎక్కువగా కనిపించాయి. వారిలో సగం మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే కరోనా కేవలం ఊపిరితిత్తుల మీద దాడి చేసే వ్యాధి కాదు. రక్తం చిక్కబడడం, గడ్డకట్టడం వంటి లక్షణాలు దీనిలో ఎక్కువని గుర్తించారు. దానిని బట్టి కరోనా చికిత్సలో రక్తాన్ని పలుచన చేసే మందులూ వాడడం మొదలైంది. బహుశ రక్తం గడ్డకట్టడం నివారిస్తే వ్యాధి తీవ్రత తగ్గించవచ్చునేమోనని మౌంట్ సినాయ్ హాస్పిటల్ అధిపతి డాక్టర్ డేవిడ్ రైక్ అభిప్రాయపడ్డారు.

ఇక పిన్న వయస్కుల్లో అసాధారణంగా స్ట్రోక్స్ రావడం చాలా విచిత్రమని  న్యూరోసర్జన్ డాక్టర్ జే మాకో ఆశ్చర్యపోయారు. కొందరి వయసు 31 మాత్రమేనని ఆయన తన అనుభవాన్ని వివరించారు. మరికొందరు డాక్టర్లు ఊపితిత్తులలో రక్తం గడ్డకట్టడం చూసి బిత్తరపోయారు. ఈ అనుభవాలతో కరోనా చికిత్స విధానంలో మార్పులు ప్రవేశపెట్టాల్సి రావడం గమనార్హం. మరే ఇతర వైలరస్ లోనూ ఇలాంటి లక్షమాలిు చూడలేదని ఫిలదెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ పాస్కల్ జబూర్ అన్నారు.

ఈ పరిశీలనల ఫలితంగా బోస్టన్‌లోని బెత్ ఇజ్రేల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లో తీవ్రంగా జబ్బుపడిన కరోనా రోగులకు రక్తం గడ్డకట్టకుండా చూసే మందును ప్రయోగాత్మకంగా ఇచ్చిచూశారు. సాధారణంగా జబ్బుపడి మంచానికే పరిమితమైనవారిలో రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కోరనా వల్ల ఆ లక్షణాలు సత్వరమే రావడం సమస్యగా మారింది.

అయితే రక్తం పలుచన చేసే మందులు ఇవ్వడం వల్ల కోరనా రోగులు ఒక్కసారిగా లేచి కూర్చుని ఇంటికి నడిచి వెళ్లిపోతారని అనముకుంటే ్త్యాశే అవుతుందని డాక్టర్ రైక్ హెచ్చరించారు. కొంత నెమ్మదించేందుకు మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అని ఆయన మాటలకు అర్థంగా తీసుకోవాలి.


logo