ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Aug 24, 2020 , 15:14:24

స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు! అవేంటంటే..

స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు!  అవేంటంటే..

వంట చేయాలంటే అందులో ప్ర‌ముఖ పాత్ర పోషించేది నూనె. మ‌రి నూనె అంటే అందులో చాలా ర‌కాలుంటాయి. ఒక‌రు పామ్ ఆయిల్ వాడితే మ‌రొక‌రు కొబ్బ‌రి నూనె వాడుతారు. మ‌రికొంద‌రేమో మంచిద‌ని ఆలివ్ ఆయిల్ వాడుతుంటారు. వీటిలో ఒక‌టి రేటు ఎక్కువ‌, ఒక‌టి మ‌రీ చౌక‌గా దొరుకుతుంది అని కొంద‌రు వాడ‌రు. కానీ చాలామంది మాత్రం స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ వాడుతుంటారు. ఈ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌లో విట‌మిన్ ఈ పుష్క‌లంగా ఉంటుంది. అంతేకాదు శ‌రీరానికి కావాల్సిన ఎన్నో న్యూట్రియెంట్స్‌, ఎస్సెన్షియ‌ల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ ఆయిల్ ఎంతో ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది. ఎందుకంటే గుండె జ‌బ్బుల‌ను రాకుండా అడ్డుకుంటుంది. వీరికి మాత్ర‌మే కాకుండా క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా చూస్తుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారికి స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ బెట‌ర్‌. అస‌లే క‌రోనా. ఈ టైంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ ప్ర‌తిఒక్క‌రికీ త‌ప్ప‌నిస‌రి. వంట‌ల్లో స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్ వాడి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. 


logo