ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 05, 2020 , 18:28:48

వారానికి 6 గుడ్లు తింటే గుండెజ‌బ్బులకు చెక్ ..!

వారానికి 6 గుడ్లు తింటే గుండెజ‌బ్బులకు చెక్ ..!

వాషింగ్ట‌న్: రోజుకో గుడ్డు తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని వైద్య‌రాగ్య నిపుణులు సూచిస్తుంటార‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వారానికి 3 నుంచి 6 గుడ్లు ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్టొచ్చ‌ని తాజాగా జ‌రిపిన ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆధ్య‌ర్యంలోని ఫువాయి ఆస్ప‌త్రి వైద్యురాలు జియా నేతృత్వంలోని బృందం ఈ అధ్య‌య‌నం జ‌రిపింది.

సాధారణంగా చైనీయుల మ‌ర‌ణాల‌కు సంబంధించి స‌ర్వే చేయ‌గా..వారానికి 3-6 గుడ్లు తీసుకున్న వారిలో హృద్రోగ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. వారానికి ఒక గుడ్డు తీసుకుంటే 22 శాతం రిస్క్ ఉండ‌గా..మొత్తం మ‌ర‌ణాల్లో ఈ రిస్క్ 29 శాతంగా ఉన్న‌ట్లు తేలింద‌ట‌. అంతేకాదు వారానికి 10 క‌న్నా త‌క్కువ గుడ్లు తింటే 39 శాతం రిస్క్ ఉండ‌గా..మొత్తం మ‌ర‌ణాల్లో 13 శాతం ఈ రిస్క్ ఉన్న‌ట్లు మ‌రో ప‌రిశీల‌న‌లో తేలింద‌ట‌. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo