జున్నుతో విట‌మిన్ డి లోపానికి చెక్‌..!


Mon,December 31, 2018 11:33 AM

గేదె లేదా ఆవు ప్ర‌స‌వించిన‌ప్పుడు మొద‌టి సారిగా వ‌చ్చే పాల‌ను జున్ను పాలు అంటారు. అలా కాకుండా సాధార‌ణ పాల‌ను విర‌గ్గొట్టి కూడా జున్ను తయారు చేసుకోవ‌చ్చు. అయితే సాధార‌ణంగా జున్నులో పాల క‌న్నా పోష‌కాలు ఎక్కువగా ఉంటాయి. జున్నును చాలా మంది అనేక ర‌కాలుగా త‌యారు చేసుకుని తింటారు. ఎలా తిన్నా జున్ను వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జున్నులో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాలు, ఎముక‌ల‌ను దృఢంగా చేస్తుంది. గ‌ర్భిణీలు జున్ను తిన‌డం వ‌ల్ల బిడ్డ ఎదుగుద‌ల సరిగ్గా ఉంటుంది.

2. విట‌మిన్ డి లోపం ఉన్న వారు జున్ను తిన‌డం వ‌ల్ల ఆ లోపాన్ని స‌రి చేసుకోవ‌చ్చు. జున్నును త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది.

3. హైబీపీ ఉన్న వారు జున్ను తిన‌డం మంచిది. బరువు పెర‌గాల‌నుకునే వారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి.

4. జున్నులో ఉండే విట‌మిన్ బి2 జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

5. జున్నులో ఉండే విట‌మిన్ ఎ శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌రుస్తుంది. విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి.

2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles