'కొవ్వు'ను కరిగించే 'నూనె'..!


Sat,December 5, 2015 04:31 PM

మనలో అనేక మంది ప్రధానంగా మహిళలు 'కొబ్బరినూనె'ను ఎక్కువగా జుట్టుకి రాసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. కేరళ వంటి కొన్ని దక్షిణాది రాష్ర్టాల్లోనే దీంతో ఆహారం వండుకుంటారు. అయితే దీన్ని కేవలం జుట్టుకే కాకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా అనేక ఉపయోగాలున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం.

1. కొబ్బరినూనెతో చేసిన వంటలు తింటే జీవక్రియలు (మెటబాలిజం) వేగంగా జరుగుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.

2. ఈ నూనె వాడి చేసిన వంటలు త్వరగా జీర్ణమవుతాయి. శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసికంగానూ ఎటువంటి ఒత్తిడినైనా ఇది తగ్గిస్తుంది.

3. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడుతుంది. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ మైక్రోబయల్ లిపిడ్స్, క్యాప్సిక్, క్యాప్రిలిక్, లౌరిక్ ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది.

4. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్‌కి ఇది మంచి మందు.

5. గుండెకు చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. బీపీని సమతుల్యం చేస్తుంది. ఈ నూనెలో శాచురేటెడ్ కొవ్వులు ఉండడంతో ఎటువంటి హాని ఉండదు.

6. చర్మ గాయాలపై దుమ్ము పడకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

3526

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles